శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 18 నవంబరు 2018 (09:46 IST)

సోషల్ మీడియాకు షక్ చేస్తున్న "2.O" మేకింగ్ వీడియో

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ నటించిన తాజాగా చిత్రం "2.O". సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించగా, ఈనెల 29వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రం విడుదల తేదీ సమీపిస్తుండటంతో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ ముమ్మరం చేసింది. 
 
ఇందులోభాగంగా, ఈ చిత్రం మేకింగ్ వీడియో ఒకదాన్ని విడుదల చేసింది. ఈ మేకింగ్ వేడియో అక్షయ్ కుమార్‌కు సంబంధించింది. ఈ చిత్రం కోసం అక్షయ్ కుమార్ ఏ విధంగా శ్రమించాడో ఈ మేకింగ్ వీడియోను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. 
 
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ విలన్‌గా నటిస్తున్నాడు. క్రౌమ్యాన్‌గా, వివిధ గెటప్స్21తో, చిత్ర విచిత్రమైన మేకప్‌తో అక్షయ్ కనిపిస్తాడనేది ఈ మేకింగ్ వీడియో చూస్తే అర్థమవుతుంది. తన 28 యేళ్ళ కెరీర్‌లో ఈ సినిమాకు కష్టపడినంతగా ఇంకే చిత్రానికి పడలేదని చెప్పాడంటే తన కష్టం మాటల్లో చెప్పడం కష్టం. 
 
పైగా, ఈ మేకింగ్ వీడియోను చూస్తే ఆయన పడిన కష్టం కూడా ఇట్టే తెలిసిపోతుంది కూడా. అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటించగా, లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్, రూ.550 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఒక్క భారతీయ సిన ప్రేక్షకులు మాత్రమేకాకుండా ప్రపంచ సినీ ప్రేక్షకులు కూడా ఈ చిత్రం కోసం అమిత ఆసక్తికంగా ఎదురుచూస్తున్నారు.