గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 ఆగస్టు 2018 (17:27 IST)

ఎన్నాళ్లు నటించగలుగుతానే అంతకాలం నటిగానే.. అలియా భట్

బాలీవుడ్‌లో మరో ప్రేమ జంట త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ఈ ప్రేమ జంట ఎవరో కాదు.. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్. వివాహం తర్వాత అలియా భట్ తన సినీ కెరీర్‌కు ఫుల్‌స్టాఫ్ పెట్టనుందనే వార్

బాలీవుడ్‌లో మరో ప్రేమ జంట త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ఈ ప్రేమ జంట ఎవరో కాదు.. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్. వివాహం తర్వాత అలియా భట్ తన సినీ కెరీర్‌కు ఫుల్‌స్టాఫ్ పెట్టనుందనే వార్త బాలీవుడ్‌లో హల్ చల్ చేస్తోంది. దీనిపై అలియా స్పందించారు.
 
ఈనెల ఏడో తేదీ అయిన మంగళవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 'ఆస్క్ మీ ఎనీథింగ్' సెషన్‌లో పాల్గొన్న అలియా భట్‌ను… ఓ అభిమాని… మీరు పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తారా అని అడిగాడు. దానికి అలియా భట్ బదులిస్తూ… తాను ఎన్నాళ్లు నటించగలుగుతానే అంతకాలం నటిగానే కొనసాగుతానని చెప్పింది. ఈ సమాధానంతో ఆమె ఫ్యాన్స్ ఖుషీ అయ్యారు. 
 
నిజానికి ఈ ప్రేమజంట కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. అయన్ ముఖర్జీ దర్శకత్వంలో వస్తున్న "బ్రహ్మాస్త్ర" మావీలో వీళ్లిద్దరూ లీడ్ రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సైట్స్ పై ఉంది. ఈ సినిమా ఘూటింగ్ సమయంలో వీరిద్దరూ నువ్వులేక నేనులేను అన్నట్లుగా కలిసిపోయారు. 
 
అదేసమయంలో వీరిద్దరి పెళ్లి ప్రస్తావన కూడా కార్చిచ్చులా వ్యాపించింది. వీళ్లిద్దరూ కరెక్ట్ జోడి అని త్వరలోనే  పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు వినిపించాయి. అయితే 2020 తర్వాత వీళ్ల పెళ్లి జరుగుతుందని కొన్ని వార్తలు కూడా వినిపించాయి.