NRI గర్ల్ ఫ్రెండ్ అర్థరాత్రి ఛాటింగ్... శృంగారం చేశావా అని వేధిస్తోంది...
మాకు పెళ్లై ఐదేళ్లయింది. ఇప్పుడు నా వయసు 40, నా భార్య వయసు 35. ఇంజినీరింగ్ చదివే రోజుల్లో నాకొక గర్ల్ ఫ్రెండ్ ఉండేది. ఆమె చాలా ఫ్రెండ్లీగా ఉండేది. మా ఇద్దరి మధ్య ప్రేమ వంటిదేమీ లేకుండానే గడిచిపోయింది. ఆమెకు యూఎస్‌లో జాబ్ వచ్చింది. అక్కడికి వెళ్లిపోయి సెటిలైంది. నేనిక్కడే మరో అమ్మాయిని పెళ్లాడాను. ఐతే నా యూఎస్ గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఫేస్ బుక్‌లో టచ్‌లోకి వస్తుంది. ఇద్దరం గంటల తరబడి చాటింగ్ చేస్కుంటూ ఉంటాం.
అమెరికాలో ఉదయం, మనకి రాత్రి అనే సంగతి తెలియందు కాదు. అందుకే ఆమెతో చాటింగ్ చేస్తూ వుంటే నాకు బాగా పొద్దుపోతుంది. ఇలా గత కొన్నేళ్లుగా జరుగుతూనే ఉంది. గత నాలుగైదు నెలలుగా నా భార్య నా ఎఫ్బీ గర్ల్ ఫ్రెండ్ విషయమై వేధిస్తోంది. ఆమెతో అన్ని గంటలు ఎందుకు... ఆమెతో ఏమయినా శృంగారం చేశావా ఏంటి... లేకపోతే అంత ఇంటిమసీ ఏమిటి అని వేధిస్తోంది. రాత్రిపూట బెడ్ టైంలో సైతం ఇదే వరస. శృంగారం చేయబోయి మూడాఫ్ అయిపోతున్నాను. ఆమె మనసు మార్చేదెలా...?
ముందు మీ మనసు మార్చుకోండి. ఎవరైనా పరాయి స్త్రీలతో గంటల తరబడి మాట్లాడితే సహనం కోల్పోవడం సహజమే. పైగా మీరు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పడమే కాకుండా ఆమెతో పొద్దస్తమానం చాటింగ్ చేస్తుంటే మీ భార్య ఎలా సహించగలదు. పెళ్లయిన దగ్గర్నుంచి మీరు మీ స్నేహితురాలితో చేస్తున్న సంభాషణలన్నిటినీ ఓపిగ్గా ఇంతకాలం సహించినందుకు గ్రేట్ అనుకోండి. ముందుగా మీ ఎఫ్బీ స్నేహితురాలితో సంభాషణ సమయాన్ని పరిమితం చేయండి. పొద్దస్తమానం మీరే కాదు... ఆమెతో స్నేహంగా మెలిగే అవకాశాన్ని మీ భార్యకు కూడా ఇవ్వండి. సమస్య పరిష్కారమవుతుంది.