శనివారం, 9 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 2 జనవరి 2019 (17:39 IST)

ఆకుపచ్చ ఉల్లిపాయ విత్తనాలను గుజ్జుగా చేసి తీసుకుంటే...

శృంగారం అనగానే చాలామంది మగవారిలో ఆతృత పెరిగిపోతుంది. ఎందుకుంటే ఆ ఫీలింగ్‌ని చక్కగా అనుభవించాలని ఉంటుంది. కానీ..... ఈ ఆతృత చాలావరకు శీఘ్రస్ఖలన సమస్యకు దారి తీసేలా చేస్తుంది. ఏదో చేయాలన్న తొందరలో చివరకు ఏమీ చేయలేకపోయానన్న బాధ వేధిస్తుంది. కాబట్టి శృంగారాన్ని ప్రశాంతంగా భాగస్వామిపై ప్రేమతో చేయాలి. ఈ సమస్య వల్ల వివాహజీవితం, కుటుంబ జీవితం నాశనమవుతాయి.
 
మందులు వాడడం వల్ల ఈ సమస్య నుండి పూర్తిగా బయటపడలేరు. సహజసిద్ధంగా లభించే కొన్ని రకాల పదార్థాలను ఉపయోగించి తృప్తికరమైన శృంగార జీవితాన్ని అనుభవించవచ్చు. అదెలాగో చూద్దాం.
 
1. ఆకుపచ్చ ఉల్లిపాయ విత్తనాలు శీఘ్రస్ఖలన సమస్యను తొలగిస్తాయి. వీటిని బాగా గుజ్జుగా చేసి నీటిలో కలుపుకుని తాగితే శీఘ్రస్ఖలన సమస్య నయం అవుతుంది. అంతేకాదు తెల్ల ఉల్లిపాయల్ని, రోజూ వాడే ఉల్లిపాయల్ని కూడా వడవచ్చు.
 
2. భార్య దగ్గరకు రాగానే ఓ ఆవేశపడిపోయి, ఆరాటంగా వెంటనే మీద పడిపోకూడదని అంటున్నారు. అంటే ఆడవాళ్లకు ఎలాగు త్వరగా భావప్రాప్తి కలుగదు కాబట్టి ప్రతి భర్త ముందుగా సహనంతో ఉండి భార్య ఫీలింగ్స్‌ని బట్టి శృంగారంలో పాల్గొనాలి.
 
3. సహజసిద్ధంగా లభించే వెల్లుల్లి శీఘ్రస్ఖలన సమస్యని నివారిస్తుంది. ఇది రక్తప్రసరణను చక్కగా జరిగేలా చేస్తుంది. అంతేకాక శరీరానికి వేడిమిని కలిగిస్తుంది. ప్రతిరోజు 3-4 వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని వాటిని ఆవు పాలల్లో వేసి వేడి చేసుకోవాలి. వెల్లుల్లి బంగారు వర్ణంలోకి వచ్చాక వాటిని తీసుకుని నమలాలి. ఇలా చేయడం వల్ల చక్కని ఫలితం ఉంటుంది.
 
4. అల్లం రక్తప్రసరణను సరిచేస్తుంది. అలాగే తేనె ఒక మంచి నిరోధకంగా పని చేస్తుంది. ప్రతిరోజు అర టేబుల్ స్పూన్ అల్లం రసంలో అర టేబుల్ స్పూన్ తేనె కలిపి పడుకునే ముందు తీసుకోవడం వల్ల శృంగార జీవితం మెరుగుపడుతుంది.
 
5. శృంగారంలో పాల్గొనేటప్పుడు మగవాడు కోపంగా ఉండకూడదని, చాలా ప్రశాంతంగా శృంగారాన్ని ఆస్వాదించేలా ఉండాలని, నిగ్రహం పాటించాలని నిపుణులు చెబుతున్నారు.