శబరిమలలో విమెన్ వాల్... మానవహారంగా మహిళల హారం
సుప్రసిద్ధ అయ్యప్ప స్వామి ఆలయంలో అన్ని వయోవర్గాలకు చెందిన మహిళలకు ప్రవేశం కల్పిస్తూ.. సుప్రీం కోర్టు తీర్పు నిచ్చిన నేపథ్యంలో.. మహిళలు అయ్యప్పను దర్శించుకునేందుకు వీలు లేదని అయ్యప్ప భక్తులు ఆందోళన బాట పట్టారు.
అయితే సుప్రీం కోర్టు తీర్పుకు అనుగుణంగా మహిళలు 620 కిలోమీటర్ల మేరకు ఒక హారంగా నిలబడనున్నారు. ఉత్తర కేరళలోని కాసరగడ్ నుంచి దక్షిణ కేరళలోని తిరువనంతపురం వరకూ మహిళలు హారంగా నిలబడనున్నారు. దీనిలో సుమారు 50 లక్షల మంది మహిళలు పాల్గొంటారని అంచనా. వీరికి తెరవెనుక కొంతమంది పురుషులు సహకారం అందిస్తున్నారు.
శబరిమల తీర్పుతో విభేదిస్తున్న వారికి వ్యతిరేకంగా మహిళలు గళమెత్తడంగా ఈ విమెన్ వాల్‌ను ముఖ్యమంత్రి పినరాయి విజయన్ అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రభుత్వోద్యోగులను, ఇతర సంస్థల సిబ్బందిని ప్రభుత్వం కోరింది.