మంగళవారం, 7 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. దాంపత్యం
Written By
Last Modified: సోమవారం, 21 జనవరి 2019 (14:09 IST)

నీ కన్నెపొర ఏమైంది...? ఎలా ఎంజాయ్ చేశావంటున్నాడు...

నేను పీజీ చేశాను. ఇటీవలే వివాహమైంది. శోభనం కూడా ముగిసింది. అయితే, శోభనం రోజున భర్తతో బాగా కలిసి పోయి ఎంజాయ్ చేశాను. దీంతో ఆయన నన్ను అనుమానిస్తున్నాడు. అసలు అంత సులువుగా ఎలా జరిగిందని, కన్నెపొర ఏమైందని, నేను కన్యను కాదని నన్ను హింసిస్తూ వదిలేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో తీవ్రమైన మనస్థాపం చెంది, భయానికి లోనవుతున్నాను. శృంగారానికి సంబంధించిన పరిజ్ఞానాన్ని పుస్తకాలు, హెల్త్ సైట్స్‌లో చదివి తెలుసుకున్నా. ఫలితంగా ఆయనకు అనుకూలంగా శోభనం రాత్రి నాడు నడుచుకున్నా. ఇదే ఇపుడు నా పాలిట శాపంగా మారింది. ఏం చేయాలి? 
 
కన్నెపొర గురించి మాట్లాడటం, దాని గురించి ప్రచారంలో వున్న నమ్మకాలను ఇంకా విశ్వసించడం మూర్ఖత్వం. 99 శాతం మంది యువతుల్లో ఈ హైమన్ పొర పెళ్లికి ముందే చిరిగిపోతుంది. ప్రస్తుతం కన్నెపొర అనే పేరే స్త్రీని అవమానించేదిగా మారిపోయింది. 
 
అదేవిధంగా శోభనం రోజున పురుషుడు చేసే ఫోర్‌ప్లే వల్ల ప్రవేశం సులువుగా జరిగిపోయింది. దీంతో మీరేదో వివాహపూర్వ సంబంధం కలిగి ఉన్నారని మీ భర్త ఆలోచించడం తప్పు. తొలి రాత్రుల్లో శృంగారోద్వేగానికి పురుషులు లోనైనట్లే స్త్రీలూ లోనవుతారు. దానివల్ల సులభంగా జరిగింది. అనవసర సందేహాలు మాని శాస్త్రీయమైన శృంగార జ్ఞానం పెంచుకోమనండి. ఇదే మీ సమస్యకు పరిష్కార మార్గం.