శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 28 జనవరి 2019 (17:15 IST)

కోర్కె తీర్చకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తా... పరారీలో పితాని

చిన్నారులకు మంచి విద్యాబుద్ధులు చెప్పించాల్సిన ఓ అధ్యాపకుడు కామాంధుడి అవతారమెత్తాడు. తన కామవాంఛ తీర్చకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించాడు. ఈ విషయం చివరకు పోలీసుల దృష్టికి వెళ్లడంతో లెక్చరర్ కనిపించకుండా పారిపోయారు. తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ఈ ఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
తూగో జిల్లాలోని సామర్లకోటలో ఉన్న వైఎల్ఆర్ కాలేజీలో ఓ యువతి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఇదే కాలేజీలో పితాని నూకరాజు అనే వ్యక్తి లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఈయన ఆ విద్యార్థినిపై కన్నేసి.. తన కామవాంఛ తీర్చాలంటూ వేధించడం మొదలుపెట్టారు. 
 
అక్కడితో ఆగకుండా అమ్మాయి ఫోన్‌ నంబరుకు అశ్లీల ఫొటోలు, సందేశాలు పంపడం మొదలుపెట్టాడు. తన మాట వినకుంటే పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరించసాగాడు. ఈ వేధింపులను తట్టుకోలేక బాలిక తల్లిదండ్రుల దృష్టికీ తీసుకెళ్లడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
ఈ నేపథ్యంలో యువతి ఫిర్యాదుతో సదరు కీచక లెక్చరర్‌పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు. అయితే ఈ విషయం ఎలాగో ముందుగానే తెలుసుకున్న పితాని నూకరాజు పరారయ్యాడు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని అన్నారు.