ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 21 జనవరి 2019 (17:01 IST)

నా కోర్కె తీర్చేందుకు నీ కూతురును పంపుతావా...లేదా?: యజమాని - ఆమె తల్లి...

హైదరాబాద్‌లో ఓ షాపింగ్ మాల్ యజమాని వేధింపులు తట్టుకోలేక ఓ తల్లి  ప్రాణం తీసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ శివారులోని మైలార్‌దేవ్‌పల్లిలో ఉన్న ఓ షాపింగ్ మాల్‌లో ఓ అమ్మాయి పనికి కుదిరింది. ఆమెపై కన్నేశాడు ఆ మాల్ యజమాని వివేకానంద(40). ఆమెను ఎలాగైనా లోబర్చుకోవాలని అనేక ప్రయత్నాలు చేశాడు. 
 
లైంగికంగా వేధించడం మొదలుపెట్టాడు. ఆయినా ఆమె లొంగలేదు.. ఫలితం లేదనుకొని ఏకంగా ఆమె తల్లి కన్యాకుమారితో మాట్లాడి తనకు సహకరించాలని ఒత్తిడి చేశాడు. అంతేకాదు కోరిక తీర్చకపోతే మీ అంతు చూస్తామంటూ తల్లి కన్యాకుమారిని బెదిరించాడు. కొద్దిరోజులుగా ఈ వేధింపులు తీవ్రం కావడంతో తల్లీకూతుళ్లు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. 
 
సమస్య నుంచి ఎలా బయటపడాలో తెలియక సతమతమవుతున్నారు ఆ తల్లీకూతుళ్లు. తను చనిపోతే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించిన తల్లి కన్యాకుమారి ఆదివారం ఉదయం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి వేధింపులకు పాల్పడ్డ షాపింగ్ మాల్ యజమానిని అరెస్ట్ చేశారు.