శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 అక్టోబరు 2018 (11:46 IST)

థాయ్‌లాండ్‌ ధనవంతుడు.. హెలికాఫ్టర్ ప్రమాదంలో మృతి..

హెలికాఫ్టర్ ప్రమాదంలో థాయ్‌లాండ్‌లోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన విచాయ్ శ్రీవద్దన్ ప్రభ దుర్మరణం పాలయ్యారు. ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ ''లెసిస్టర్ సిటీ'' యజమాని కూడా ఆ హెలికాప్టర్‌లోనే వున్నారు. ఈ  హెలికాప్టర్ ఇంగ్లీష్ ఫుట్‌బాల్ క్లబ్ కార్ పార్కింగ్ స్థలంలోనే కుప్పకూలింది. వెంటనే మంటలు చెలరేగడంతో హెలికాప్టర్లోని విచాయ్ సజీవదహనం అయ్యారు. 
 
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. శనివారం జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్‌ను వీక్షించిన అనంతరం ఆయన తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు. హెలికాప్టర్ నింగికెగసిన కాసేపటికే అదుపు తప్పింది. వెంటనే మంటలు చెలరేగడంతో.. విచాయ్ ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు.