శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 అక్టోబరు 2018 (10:55 IST)

దాదాపు మేం చచ్చామనుకున్నాం... అర్జున రణతుంగ

శ్రీలంకలో అధికార పోటీ ఏర్పడింది. ఆ దేశ ప్రధానమంత్రిగా రణిల్‌ విక్రమసింఘేను తొలగించి మహిందా రాజపక్సేను ఆ దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన నియమించడంతో అక్కడ అధికార సంక్షోభం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న రణిల్ విక్రమ సింఘే ప్రభుత్వంలో పెట్రోలియం శాఖామంత్రిగా ఉన్న మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ హుటాహుటిన కొలంబోకు చేరుకుని తన కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే, మహిందా రాజపక్సే అనుచరులు ఆయనపై దాడి చేసేందుకు యత్నించగా, ఆయన్ను లంక సైన్యం రక్షించింది. 
 
దీనిపై అరున రణతుంగ స్పందిస్తూ, ఈ రోజు నేను ప్రాణాలతో ఉన్నానంటే ఆ దేవుని దయ, నా భద్రతా సిబ్బంది ధైర్యసాహసాలే కారణం. రాజపక్సే అనుచరులు నన్ను చంపాలని చూశారు. దాదాపు మేం చచ్చామనుకున్నాం. మా దేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది. నాకు ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి ఘటనలు శ్రీలంక ప్రజలు సహించలేరు' అని వ్యాఖ్యానించారు. 
 
కాగా, గత 18 ఏళ్లుగా ఎంపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న అర్జున రణతుంగ.. గతేడాదిన్నరగా పెట్రోలియం శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన సోదరులు ప్రసన్న రణతుంగ, రువాన రణతుంగాలు కూడా ఎంపీలే కావడం గమనార్హం. ఇక 1996 ప్రపంచకప్‌ను అర్జున రణుతంగ సారథ్యంలోనే శ్రీలంక గెలిచిన విషయం తెలిసిందే.