శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: సోమవారం, 6 నవంబరు 2017 (15:04 IST)

హెలికాప్టర్ ప్రమాదంలో సౌదీ యువరాజు దుర్మరణం... చంపేశారా?

గాలిలో ప్రయాణం గురించి వేరే చెప్పక్కర్లేదు. చిన్న తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. ఇలాంటి దుర్ఘటనే సౌదీలో జరిగింది. సౌదీ యువరాజులలో ఒకరైన మన్సూర్ బిన్ మెక్రెన్ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఆదివారం నాడు దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరికొందరు

గాలిలో ప్రయాణం గురించి వేరే చెప్పక్కర్లేదు. చిన్న తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. ఇలాంటి దుర్ఘటనే సౌదీలో జరిగింది. సౌదీ యువరాజులలో ఒకరైన మన్సూర్ బిన్ మెక్రెన్ హెలికాప్టర్లో ప్రయాణిస్తూ ఆదివారం నాడు దుర్మరణం పాలయ్యారు. ఆయనతోపాటు ప్రయాణిస్తున్న మరికొందరు కూడా మరణించినట్లు స్థానిక మీడియా ద్వారా తెలుస్తోంది. దక్షిణ సరిహద్దు యెమెన్‌ ప్రావిన్స్‌కు సమీపంలోకి హెలికాప్టర్ రాగానే ఒక్కసారిగా అది కుప్పకూలిపోయిందని సమాచారం.
 
మెక్రెన్ ప్రస్తుతం అసిర్‌ ప్రావిన్స్‌కి డిప్యూటీ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. సౌదీ సింహాసనాన్ని అధిష్టించిన వారిలో బాధిత యువరాజు తండ్రి ఒకరు. కాగా హెలికాప్టర్‌ ఎందుకు కూలిందన్న దానిపై విచారణ ప్రారంభించారు. ఐతే ఆర్థిక సంస్కరణల నేపధ్యంలో సౌదీ రాజు సల్మాన్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. 11 మంది యువరాజులు, నలుగురు మంత్రులు, ఇంకా మాజీమంత్రులను కొందరిని అరెస్టు చేయించారు. ఇది జరిగిన మరుసటి రోజే ఆయన కుమారుడైన యువరాజు మెక్రెన్ దుర్మరణం చెందడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.