శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 31 జనవరి 2019 (17:50 IST)

అఖిల్ హీరోయిన్ పెళ్లి ఈ తమిళ హీరోతోనా?

తమిళ సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లుగా ఉన్న హీరోలంతా ఈ ఏడాది ఒక ఇంటివారు కాబోతున్నారు. మొన్న విశాల్ తన పెళ్లి గురించి ప్రకటించగా ఇప్పుడు ఆర్య పెళ్లి కుదిరినట్లు తెలుస్తోంది. ఆర్యకు కాబోయే భార్య కూడా హీరోయినే, కానీ ఇండస్ట్రీకి వచ్చి ఇంకా మూడేళ్లు కూడా కాలేదు, పైగా ఇంకా గుర్తింపు కూడా సంపాదించుకోకుండా కెరీర్ ఆరంభంలోనే పెళ్లి పీటలెక్కుతోంది. ఆమె పేరు సాయేషా సైగల్. 
 
ఈమె ఆర్యతో కలిసి గజినీ కాంత్ అనే చిత్రంలో నటించింది. ఇందులో వీరిద్దరూ పండించిన రొమాన్స్ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా షూటింగ్‌లోనే వీరి పరిచయం కాస్త ప్రేమగా మారిందని, ఇరు కుటుంబాలు సమ్మతించడంతో వీరిద్దరూ త్వరలో వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. వివాహం మార్చి 9, 10 తేదీలలో జరగనుందని తెలుస్తోంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీరిద్దరి మధ్య 17 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉంది, ఆర్య వయస్సు 38 ఏళ్లు మరియు సాయేషా వయస్సు 21 ఏళ్లు.
 
తమిళ హీరో అయినప్పటికీ ఆర్య తెలుగునాట కూడా సుపరిచితుడే. ఇతనికి సంబంధించిన కొన్ని రీమేక్ సినిమాలు టాలీవుడ్‌లో కూడా మంచి విజయం సాధించాయి. ఇక సాయేషా కూడా అఖిల్ మొదటి సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఆమె డాన్సులు, నటనకు మంచి మార్కులే పడ్డప్పటికీ ఆ చిత్రం విజయం సాధించకపోవడంతో ఆఫర్లు ఆమెను వరించలేదు. ప్రస్తుతం వీరిద్దరూ సూర్య నటిస్తున్న కప్పాన్ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీరి వివాహం కోసం కొంత కాలం ఆగాలి మరి!!