నాలో మగలక్షణాలు ఎక్కువ... ప్రేమించుకుని ఏం చేద్ధామన్నాడు?... ద్యుతీచంద్

Dutee Chand
Last Updated: సోమవారం, 27 మే 2019 (19:43 IST)
ఇటీవల ఓ అమ్మాయితో స్వలింగ సంబంధం కొనసాగిస్తున్నట్టు భారత అథ్లెంట్ ద్యుతీచంద్ సంచలన వ్యాఖ్యలు చేసిన. ఈమె మరోమారు సంచలన ప్రకటన చేసింది. ఈ ప్రకటన ఇపుడు కలకలం రేపుతోంది. తనలో మగ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. పైగా, తాను ఏడో తరగతిలో ఉండగానే ఓ అబ్బాయితో ప్రేమలోపడ్డానని, కొద్దిరోజుల తర్వాత బాయ్‌ఫ్రెండ్ తనను వదిలివేశారని చెప్పుకొచ్చింది.

గత యేడాది జరిగిన ఆసియా క్రీడల్లో ద్యుతీచంద్ మాతృదేశానికి బంగారు పతకం సాధించి పెట్టింది. దీంతో ప్రతి ఒక్కరూ ఆమెను భారత్ ఆశాకిరణం అని భావిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మాట్లాడుతూ, తనలో మగలక్షణాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. తన ప్రియుడు 2014లో వదిలేసి వెళ్లిపోయాడని చెప్పారు. అప్పటికే తనలో మగలక్షణాలను ప్రేరేపించే టెస్టోస్టిరాన్ స్థాయి అధికంగా ఉన్నట్టు తేలిందన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నపుడు ప్రేమించుకుని ఏం చేద్దామని చెప్పి అతను వదిలి వెళ్లిపోయాడని తెలిపింది.దీనిపై మరింత చదవండి :