శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By
Last Updated : శుక్రవారం, 26 ఏప్రియల్ 2019 (13:55 IST)

మీరు ప్రేమిస్తున్న విషయాన్ని మీరే చెప్పాలి.. లేదంటే..?

అబ్బాయి తను ప్రేమించిన విషయాన్ని అమ్మాయికి చెప్పడానికి చాలా ఇబ్బందులు పడుతుంటారు. రకరకాల పద్ధతులలో వారు ప్రేమించిన విషయం చెప్పాలని అనుకుంటారు. కానీ కొన్నిసార్లు చెప్పలేక భయపడుతారు. అలానే అమ్మాయిలకు నచ్చేలా వారిని వారు పూర్తిగా మార్చేసుకుంటారు. 
 
ఇలా చేయడం వలన కొన్నిసార్లు ఫలితం వరిస్తే మరికొన్నిసార్లు బాధ కలిగిస్తుంది. అందువలన మొత్తానికి అబ్బాయిలు వారి ప్రేమను తెలియజేయడం కోసం నానా ఇబ్బందులు పడడమే కాక.. వారిని కలిసేందుకు కూడా ఇబ్బందిగా భావిస్తారు. అలాంటివారికోసం కొన్ని ప్రేమ చిట్కాలు...
 
ముందుగా వారు ప్రేమకు సంబంధించిన విషయాలను ఎక్కువగా సెల్‌ఫోన్‌లో వ్యక్తం చేస్తుంటారు. ఇలా చేయడం వలన ఇష్టాయిష్టాలను నేరుగా చెప్పేందుకు వీలుండదు. కనుక వీలైనంత వరకు లెటర్స్ రాయడం చేయాలి. అప్పుడే మీమీద ప్రత్యేకమైన గుర్తింపు వస్తుంది. ఎందుకంటే.. మీ మనసులో ఉన్న భావాలను నేరుగా కాగితం మీద రాయడం వలన ఆ అమ్మాయి చదివేటప్పుడు తన మనసుకు నీ భావాలు తొందరగా దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. 
 
ముఖ్యంగా ప్రేమించిన వారి ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం చాలాముఖ్యం. వాళ్ళ ఇష్టాలను పూర్తిగా తెలుసుకున్న తరువాత మీ మనసులో ఉన్న భావాలను చెప్పడం మొదలుపెట్టాలి. అలానే వారికి బాగా ఇష్టమైన ప్లేస్‌కి తీసుకెళ్ళి మీ ప్రేమను తెలియజేయాలి. అప్పుడు ఫలితం ఉండొచ్చు. 
 
మరో విషయం.. మీరు ప్రేమిస్తున్న విషయాన్ని మీరే చెప్పాలి. మీ ఫ్రెండ్స్ ద్వారా చెప్పాలని అనుకోకండి. ఎందుకంటే.. మీరు ప్రేమిస్తున్న విషయాన్ని మీ ద్వారా తెలుసుకుంటేనే అమ్మాయిలు ఇష్టపడుతారు.