బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. గృహాలంకరణ
Written By
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (16:33 IST)

ఇంటి లోపల శ్రద్ధ పెడతాం కానీ ఎంట్రన్స్ డోర్ గురించి...?

ఇళ్లు చూసేందుకు అందంగా ఉంటే సరిపోదు. కాస్త ఆశ్చర్యం, ఆసక్తి కలిగించేలా ఉండాలి. అందుకోసం చేసే మార్పులు మన పనుల్లో శ్రమను తగ్గించేలానూ ఉండాలి. అలాంటి సులభమైన ఇంటి చిట్కాలను ఓసారి తెలుసుకుందాం..
 
మొదటిగా ఇంటి లోపల శ్రద్ధ పెడతాం కానీ ఎంట్రన్స్ డోర్ గురించి పెద్దగా పట్టించుకోము. తుడవడం తప్ప దాన్నేం చేయగలం అనుకుంటున్నారా.. ఆ డోర్ ఆకర్షణీయంగా కనిపించేలా ముదురు రంగు పెయింట్ వేయొచ్చు. మంచి కొటేషన్ ప్లేట్ తగిలించొచ్చు. ఏదీ వద్దనుకుంటే ఇంటి నంబర్‌ను క్రియేటివ్‌గా రాసుకోవచ్చు. ఇంకా వాకిలి అందంగా కనిపించాలంటే పూల కుండీలు పెట్టుకోవాలి. 
 
ఇంట్లో గది చిన్నదైతేనేం.. అద్దాలతో దాన్ని విశాలంగా కనిపించేలా చేయొచ్చు. అందుకు కిటికీల బయటున్న గార్డెన్ ప్రతిబింబించేలా ఆ అద్దాలను అమర్చాలి. అప్పుడే చూసేవాళ్లకు విశాలమైన భావన కలుగుతుంది. ఇక సోఫాను గోడలకు ఆనిస్తే గది విశాలంగా కనిపిస్తుందని అనుకుంటాం.. కానీ, సోఫాకు గోడకు మధ్య సన్నని టేబుల్ ఉంచితే సరిపోతుంది. 
 
డెకరేటింగ్, స్టయిలింగ్‌కు ఓ రూల్ ఉంది. అది అలంకరించే వస్తువులు మరింత ఎట్రాక్టివ్‌గా కనిపించాలంటే గది మూలల్లో లేదా సెంటర్లో ఉండే టేబుల్ మీద అలంకరణ వస్తువులను మాత్రమే ఉంచాలి. అంతకంటే ఎక్కువ ఉంచితే ఎబ్బెట్టుగా ఉంటాయి.