లిప్‌స్టిక్ వేస్తున్నారా అయితే ఈ టిప్స్ మీ కోసం..?

Last Updated: గురువారం, 11 ఏప్రియల్ 2019 (11:54 IST)
లిప్‌స్టిక్ వేస్తున్నారా అయితే ఈ టిప్స్ పాటించండి. మీ రంగుకు తగ్గట్టు లిప్‌స్టిక్ ఎంచుకోవాలని బ్యూటీషన్లు అంటున్నారు. తెల్లగా ఉండే మహిళలు ఆరంజ్, ఎరుపు, బ్రౌన్ వంటి రంగులు లిప్‌స్టిక్‌గా ఎంచుకోవాలి. చామనఛాయగా ఉండే మహిళలు లైట్ బ్రౌన్ లిప్‌స్టిక్ వేసుకోవాలి. అలానే లైట్ జెర్రీ కలర్ లిప్‌స్టిక్ కూడా ఎంచుకోవచ్చునని బ్యూటీషన్లు సూచిస్తున్నారు.

పగటి పూట లేతగా సాయంత్రం దట్టంగా లిప్‌స్టిక్ వేసుకోవాలి. వేడిమికి పెదవులు పొడిబారకుండా లిప్‌స్టిక్‌తో కాపాడుకోవాలంటే ముందుగా పెదవులకు కొబ్బరినూనె రాయాలి. 10 నిమిషాల తరువాత వెచ్చని నీటిలో కాటన్‌ను తడిపి పెదవులను తుడిచేయాలి. తర్వాత లిప్‌స్టిక్ వేసుకుంటే మీ పెదవులు సున్నితంగా, ఆకర్షణీయంగా ఉంటాయని బ్యూటీషన్లు సూచిస్తున్నారు.

ఇకపోతే ఒక లిప్‌స్టిక్‌ను ఆరునెలల తర్వాత ఉపయోగించకూడదు. లిప్‌స్టిక్ వేశాక పెదవులతో సరిచేయడం వంటివి చేయకూడదు. లిప్ పెన్సిల్‌తో అవుట్ లైన్ వేసుకుని తర్వాతే లిప్‌స్టిక్ వేసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు వాస్లిన్ రాసుకోవచ్చు. లిప్‌స్టిక్ వేసేందుకు ముందు వాస్లిన్ రాసుకున్నా పెదవులు మృదువుగా ఉంటాయి.దీనిపై మరింత చదవండి :