గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (11:27 IST)

సమంతతో ఉపాసన ఇంటర్వ్యూ.. టాలీవుడ్‌‌ అత్యుత్తమ కోడలు ఆమే..?

''బీ పాజిటివ్ హెల్త్ అండ్ లైఫ్ స్టయిల్'' మ్యాగజైన్‌కు టాలీవుడ్ హీరో రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన చీఫ్ ఎడిటర్. ఇంకా అపోలో ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్ కూడా ఆమే. తాజాగా తన మ్యాగజైన్ కోసం టాలీవుడ్ హీరోయిన్ సమంతతో ముఖాముఖి నిర్వహించారు. జిమ్‌లో వర్కౌట్లు చేస్తున్న సమంతతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం ఉపాసన తన అభిప్రాయాలు వెల్లడించారు. 
 
టాలీవుడ్‌లో అత్యుత్తమ కోడలు అవార్డు ఇస్తే.. సమంతకే ఇవ్వాలని కితాబిచ్చారు. సమంత స్వీటెస్ట్ మాత్రమే కాదు, పవర్ ఫుల్ కూడా అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఉపాసన అక్కినేని వారి కోడలు సమంతతో పలు ఆరోగ్య రహస్యాలు, సౌందర్య చిట్కాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఫిట్‌నెస్ వర్కౌట్ల గురించి వివరాలు రాబట్టారు. తన మ్యాగజైన్ తాజా ఎడిషన్‌లో సమంత ముఖచిత్రంతో ప్రత్యేక కథనాన్ని పొందుపరిచారు.
 
ఇక సమంత ఫిట్‌నెస్ గురించి రానా దగ్గుబాటి చేసిన కామెంట్ గురించి ఉపాసన పాయింట్ అవుట్ చేసారు. ఇటీవల ఓ కార్యక్రమంలో రానా సమంతను ఫిట్‌నెస్ విషయంలో కొనియాడారు.


టాలీవుడ్‌లో వంద కిలోల బరువు ఎత్తే ఏకైక హీరోయిన్ సమంతనే అని చెప్పారు. 150 కిలోల వెయిట్ ఎత్తేందుకు ప్రయత్నిస్తున్నారని అంటే.. సమంత మాత్రం 100 కిలోలకే పరిమితం అయ్యానని చెప్పుకొచ్చింది.