సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్
Last Updated : గురువారం, 21 మార్చి 2019 (19:30 IST)

ఆ పని చేయడానికి సమంత ఎంత తీసుకుంటుందో తెలుసా?

సినీతారలకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉంటారు. వారు ఏదైనా ఒక అంశాన్ని పోస్ట్ చేస్తే అది నిమిషాల్లో మిలియన్ల సంఖ్యలో వ్యక్తులకు చేరుతుంది. ఇప్పుడు ఇది కూడా వారికి ఒక ఆదాయవనరుగా మారింది. ఎంత ఎక్కువమంది ఫాలోవర్లు ఉంటే అంత ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఇలాంటి సెలిబ్రిటీలు తమ సోషల్ మీడియా అకౌంట్‌లో ఏదైనా పోస్ట్ చేయాలంటే లక్షల్లో ఛార్జ్ చేస్తున్నారు.
 
టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లు తమన్నా, కాజల్, తాప్సీలు సోషల్ మీడియా సంపాదనలో ముందున్నారు. వీరు తమ సోషల్ మీడియా అకౌంట్‌లో ఒక పోస్ట్ పెట్టాలంటే దాదాపు రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. అయితే సమంత ఆ విషయంలో వాళ్లందరినీ మించిపోయింది.

టాలీవుడ్, కోలీవుడ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్న సమంత ఎక్కువగా కాస్ట్యూమ్స్ బ్రాండ్‌లను ప్రచారం చేస్తుంటుంది. అయితే ఇలా పోస్ట్ చేయడానికి సమంత ఒక్కో పోస్ట్‌కు రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల రూపాయల వరకు ఛార్జ్ చేస్తుందట. టాలీవుడ్‌లో ఇదే ఎక్కువ మొత్తం అని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.