శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 18 మార్చి 2019 (11:36 IST)

రిలయన్స్ జియో.. కొత్త ప్లాన్స్.. రూ.999 నుంచి రూ.9,999 వరకు

టెలికాం రంగంలో రిలయన్స్ జియోకున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఉచిత డేటా పేరిట జియో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా జియో వినియోగదారులను ఆకర్షించేందుకు గాను చౌక ప్లాన్‌లు, డేటా ఆఫర్లు ఇస్తోంది. ఇందులో భాగంగా రూ.999 నుంచి రూ.9,999 వరకు రీఛార్జ్ ఆఫర్లను ప్రకటించింది.


అవేంటంటే.. 
 
1. రూ.999.. ఈ ప్యాక్ కింద 60జీబీ డేటా, 90 రోజుల వ్యాలీడిటీ, 100 ఎస్ఎమ్ఎస్‌లు, ఉచిత వాయిస్ కాల్స్‌ను జియో అందిస్తోంది. 
 
2. రూ. 1,999 మొత్తాన్ని రీఛార్జ్ చేసుకుంటే 125జీబీ డేటా, 180 రోజుల వ్యాలిటీడీ, ఉచిత వాయిస్ కాల్స్, వంద ఎస్సెమ్మెస్‌లు
 
3. రూ.4,999 ప్లాన్ కింద 350 జీబీ డేటా, 360 రోజుల వ్యాలిడిటీ, వంద ఎస్సెమ్మెస్‌లు, ఉచిత వాయిస్ కాల్స్

4. రూ.9,999 ప్లాన్ కింద 750 జీబీ డేటా, 360 రోజుల వ్యాలిడిటీ. వంద ఎస్సెమ్మెస్‌లు, ఉచిత వాయిస్ కాల్స్.

ఇదే రేటులో ఇతర టెలికాం సంస్థలు ఇచ్చే డేటా, కాల్స్ వంటి ఇతర సదుపాయాల్లో జియో మాత్రమే ముందుంది.