రిలయన్స్ జియో 10జీబీ 4జీ డేటాను ఉచితంగా అందించనుందా..? ఎప్పుడు?

JioFi
మోహన్| Last Updated: గురువారం, 21 ఫిబ్రవరి 2019 (15:26 IST)
భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో పెను సంచలనాలకు దారి తీసింది. ఇప్పుడు జియో వినియోగదారులకు మరో శుభవార్తను ప్రకటించింది. రిలయన్స్ జియో సెలబ్రేషన్స్ ప్యాక్ కింద 10జీబీ 4జీ డేటాను వినియోగదారులకు ఉచితంగా అందించనుంది. అయితే ఈ 10 జీబీ డేటాను కేవలం 5 రోజుల పాటు మాత్రమే అందిస్తుంది. అంటే రోజుకు సగటున 2 జీబీని వినియోగదారులు వాడుకోవాల్సి ఉంటుంది 
 
రోజు 2 జీబీ డేటా ఖాళీ అయిన తర్వాత మీ ప్లాన్‌లో ఉన్న డేటాను కూడా వినియోగించుకోవచ్చు. ఈ డేటా కస్టమర్ల జియో అకౌంట్‌లోకి ఎప్పుడు క్రెడిట్ అవుతుందో కంపెనీ ఇంకా ప్రకటించాల్సి ఉంది. గతంలో కూడా సెలబ్రేషన్స్ ప్యాక్ కింద 8 జీబీ డేటాను యూజర్లకు ఉచితంగా ఇచ్చిన విషయం తెలిసిందే. ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో సదుపాయాలను కల్పించనున్నట్లు ఆ సంస్థ తెలియజేసింది.దీనిపై మరింత చదవండి :