శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 16 ఫిబ్రవరి 2019 (19:21 IST)

#NTRMahanayakudu - నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ గడపలకు పసుపునై..?

మహానాయకుడు సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తయ్యాయి. ఈ సినిమాకు క్లీన్ యు సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమాను ఈ నెల 22వ తేదీన విడుదల చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. మహానాయకుడులో రానా పాత్ర హైలైట్ అవుతుందని సినీ పండితులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బయోపిక్‌లో రెండో భాగమైన మహానాయకుడు ట్రైలర్ విడుదలైంది. 
 
రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ప్రస్థానం ఈ ట్రైలర్‌లో కంటికట్టినట్లు చూపించారు. ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లడం, ప్రజల కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు, ఢిల్లీ రాజకీయాలను ఎదిరించి విధానం ఈ ట్రైలర్‌లో కనిపించింది. 
 
''నిశ్శబ్దాన్ని చేతగానితనం అనుకోవద్దు .. మౌనం మారణాయుధంతో సమానమని మరిచిపోకు'' అంటూ ఎన్టీఆర్ చెప్పే డైలాగ్ అదిరింది. ఇచ్చిన ప్రతి మాటా నిలబడాలి.. చేసిన ప్రతి పనీ కనబడాలి. ఇన్ టైమ్- ఆన్ డోర్ అనే ఎన్టీఆర్ డైలాగ్, చెప్పేటోళ్లు వుండాలి. లేకుంటే ఆరుకోట్ల మంది ఆయన పక్కనున్నా.. ఒంటరోడైపోతాడు.. అని రానా చెప్పే డైలాగ్ బాగుంది.
 
ఇంకా చివరిగా ''నేను రాజకీయాలు చేయడానికి రాలేదు. మీ గడపలకు పసుపునై బతకడానికి వచ్చా'' అనే మహానాయకుడి ట్రైలర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.