పగటిపూట ఆడపిల్లగా.. రాత్రిపూట పాముగా బతకడం నా వల్ల కావట్లేదు.. (వీడియో)

Last Updated: మంగళవారం, 12 ఫిబ్రవరి 2019 (11:21 IST)
కేథరీన్, లక్ష్మీరాయ్, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం నాగకన్య. జర్నీ, రాజా -రాణి ఫేమ్ జై హీరోగా నటిస్తున్నాడు. జంబో సినిమాస్ బ్యానర్‌పై ఎ శ్రీధర్ నిర్మాతగా ఎల్ సురేష్ దర్శకత్వంలో చిత్రం తెరకెక్కింది. 
 
ఇప్పటికే వరలక్ష్మి శరత్‌కుమార్ విభిన్నమైన లుక్‌తో విడుదల చేసిన పోస్టర్‌కు మంచి స్పందన లభిస్తోంది. జై క్యారెక్టర్ ఈ సినిమాకు మరో హైలైట్‌గా నిలుస్తుందని, డైరెక్టర్ సురేష్ స్టోరీ, స్క్రీన్‌ప్లే క్యూరియాసిటీ రేకెత్తిస్తుందని.. గ్రాఫిక్స్ అబ్బురపరుస్తాయని వరలక్ష్మి ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 
 
తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలైంది.తమిళ సినిమా నీయాకు తెలుగు డబ్బింగ్‌గా తెరకెక్కుతోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ఎలా వుందో ఓ లుక్కేయండి. దీనిపై మరింత చదవండి :