సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 10 ఫిబ్రవరి 2019 (11:14 IST)

కిక్కెక్కించే సన్నివేశాలతో '90 ఎంఎల్' టీజర్

బిగ్‌బాస్ ఫేం ఓవియా నటిస్తున్న చిత్రం '90 ఎంఎల్'. అనిత ఉదీప్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఒక నిమిషం 50 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లోని సన్నివేశాలు యువతకు కిక్కెక్కించేలా ఉన్నాయి. టీనేజ్ అమ్మాయిలంతా కూర్చొని మందు తాగటం, అసభ్యకర మాటలు మాట్లాడుకోవటం వంటి ఎన్నో సన్నివేశాలు ఈ టీజర్‌లో చూపించారు.
 
'రేయ్.. నేను బిగ్‌బాస్‌నే చూసినదాన్నిరా' అంటూ ఓవియా చెప్పిన డైలాగ్‌తో మొదలైన ఈ టీజర్ ఆధ్యంతం రక్తి కట్టించే సన్నివేశాలతో యూత్‌ని ఆకట్టుకుంటూ వేగంగా వ్యూస్ రాబడుతోంది. కాగా ఈ టీజర్‌ని ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఓవియా.. ఈ అడల్ట్ మూవీ చూసి ఎంజాయ్ చేయండి అని పేర్కొంది. ఈ వీడియోను దాదాపు 32 లక్షల మంది వరకు చూశారు.