శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 9 ఫిబ్రవరి 2019 (16:35 IST)

ఓవియా 90ఎమ్ఎల్ ట్రైలర్.. విమర్శలతో ట్రెండింగ్ అవుతోంది.. (వీడియో)

తమిళ బిగ్ బాస్ కాంటిస్టెంట్ ఓవియా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె బిగ్ బాస్ హౌస్‌లో వుండగా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఓవియా అడల్ట్ ఓన్లీ సినిమాగా తెరకెక్కుతున్న 90ఎమ్ఎల్ చిత్రంలో నటిస్తోంది. 
 
ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ విడుదలై విమర్శలతో వైరల్ అవుతోంది. కొత్త డైరక్టర్ అనీతా ఉదీప్ దర్శకత్వంలో బిగ్ బాస్ ఓవియా నటించే ఈ సినిమాలో అన్‌సూన్ పాల్, మసూమ్ శంకర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నటుడు శింబు సంగీతం సమకూర్చడం విశేషం. 
 
పబ్‌, పార్టీ, మందు చుట్టూ తిరిగే ఈ సినిమా డబుల్ మీనింగ్ డైలాగులతో తెరకెక్కుతోంది. ఇందులో రొమాన్స్ సీన్లకు ఏమాత్రం తక్కువ లేదు. అయితే తాజాగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌పై ఓవియా ఆర్మీ తీవ్రంగా విమర్శలు గుప్పిస్తోంది.