మంగళవారం, 28 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 30 డిశెంబరు 2018 (14:16 IST)

#ViswasamTrailer‌ను ఓ లుక్కేయండి..

2019 సంక్రాంతికి అటు టాలీవుడ్, కోలీవుడ్‌లలో స్టార్ హీరోల సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన విశ్వాసం కూడా సంక్రాంతి రేసులో వుంది.


ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే విడుదలైన నేపథ్యంలో.. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ఆదివారం విడుదలైంది.  ఈ సంక్రాంతికి తమిళ సూపర్ స్టార్ పేట్ట సినిమా, అజిత్ విశ్వాసం సినిమాలు విడుదలకానున్నాయి. 
 
పేట్టా సినిమా పోస్టర్లు, ట్రైలర్, పాటలు హిట్ టాక్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో.. అజిత్ సినిమా విశ్వాసం కూడా ఆ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది.

శిరుత్తై శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అజిత్ సరసన నయనతార నటిస్తోంది. ఈ సినిమాలో అజిత్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఓ లుక్కేయండి.