శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By కుమార్ దళవాయి
Last Updated : శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (18:05 IST)

బాక్సింగ్ ట్రైనింగ్-లాస్ ఏంజిల్స్‌కు చెక్కేసిన సంక్రాంతి అల్లుడు?

ఎఫ్2తో గ్రాండ్ విక్టరీని అందుకున్న వరుణ్ తేజ్ ఇంకా సక్సెస్‌ను పూర్తిగా ఆస్వాదించకుండానే లాస్ ఏంజిల్స్‌కు చెక్కేసాడు. అయితే వరుణ్ వెళ్లింది విహారయాత్ర కోసం కాదు, వర్కవుట్ చేయడానికి. నిజమే వరుణ్ లాస్ ఏంజెల్స్‌లో బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడట.
 
హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ సినిమా జిగర్‌తాండ రీమేక్ 'వాల్మీకి'లో వరుణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇందులో వరుణ్ హీరోగా కాకుండా నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కొన్ని సీన్లలో షర్ట్ లేకుండా కనిపించాల్సి ఉంది, దీనితో పాటు మరో సినిమాలో బాక్సర్‌గా కూడా కనిపించబోతున్నందున రెండు పనులూ ఒకేసారి పూర్తి చేయడానికి వరుణ్ బాక్సింగ్ నేర్చుకోవాలనుకున్నాడట.
 
ఇక్కడే ఉంటే ఇంటి తిండి తినడం వల్ల ఫిట్‌నెస్ రెజీమ్ దెబ్బతింటుందని భావించి, లాస్ ఏంజెల్స్‌కి చెక్కేసాడట. అయితే రెండు నెలల తర్వాత తిరిగి వచ్చి సర్‌ప్రైజ్ లుక్ ఇస్తానంటున్నాడు వరుణ్.