సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. చిట్కాలు
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (11:37 IST)

కష్టమైన పని వచ్చినప్పుడు అది కష్టమని అనుకోకుండా..?

అమ్మాయిలకు ఎలాంటి అబ్బాయిలు నచ్చుతారు.. అనే అంశంపై కొన్ని పరిశోధనల్లో రకరకాల ఫలితాలు వచ్చాయి. మరి ఆ ఫలితాలేంటో తెలుసుకుందాం..
 
1. అబ్బాయిలు వారి జీవితంలో ప్రతి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించేవారై ఉండాలి. ముఖ్యంగా తన జీవిత భాగస్వామి విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్త వహించాలి. అలానే ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి.
 
2. మీరు పెళ్లి చేసుకునే అమ్మాయి అవసరాలు తెలుసుకోవడం ఎంతైనా ముఖ్యం. వాళ్ల కోరికలు తెలుసుకుని నెరవేర్చడానికి ప్రయత్నించేవాడై ఉండాలి. 
 
3. కష్టమైన పని వచ్చినప్పుడు అది కష్టమని అనుకోకుండా.. నటన చూపించకుండా, భయపడకుండా హార్డ్‌వర్క్ చేసే వారిని అమ్మాయిలు బాగా ఇష్టపడుతారు. 
 
4. అబ్బాయి.. అమ్మాయి వద్ద నిజాయితీగా ఉండాలి. ఆర్థికంగా, సామాజికంగా భరోసా ఇచ్చేలా ఉండాలి. అలానే చేసే పనిలో శ్రద్ధ ఉన్న అబ్బాయైు ఉండాలి. ఓ లక్ష్యంతో పనిచేయగలిగే లక్షణం కలిగి ఉండే అబ్బాయి కావాలని అమ్మాయిలు కోరుకుంటున్నారు. 
 
5. మీ జీవిత భాగస్వామితో గడిపిన స్వీట్ మెమరీస్, ఇష్టమైన విషయాలు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఓర్పుగా ఉండడం నేర్చుకుంటే మంచిది.