గురువారం, 21 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : మంగళవారం, 9 ఏప్రియల్ 2019 (15:51 IST)

వాస్తు ప్రకారం ఇంట్లో ఎలా ఉండాలంటే..?

ప్రతీ ఇంట్లో పూజగది తప్పకుండా ఉంటుంది. కానీ, చాలామంది పూజగదిని శుభ్రం చేసుకోకుండా ఉంటారు. ఈ పద్ధతి మంచికాదంటున్నారు పండితులు. ప్రతిరోజూ ఇంట్లో దీపారాధన చేయాలి. రోజూ కాకపోయినా.. కనీసం వారానికి ఒక్కసారైనా ఇంటిని శుభ్రం చేసుకోవాలి. నీళ్ళల్లో కొద్దిగా దొడ్డు ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. 
 
వారంలో రెండుసార్లు సాయంత్రం సమయంలో సాంబ్రాని పొగ ఇంట్లో, వ్యాపార సంస్థల్లో వేయాలి. ప్రశాంతంగా ఉండే వాతావరణం కోరుకునేవారు ఏవైనా దేవుని సంగీత వాయిద్యాల వాయిస్ వచ్చేలా ఏర్పాటు చేసుకుంటే మంచిది.
 
డ్రాయింగ్ రూమ్‌లో కుటుంబ సభ్యుల ఫోటోలు చిత్రాలను పెట్టుకుంటే బాగుంటుంది. నవ్వుతూ ఉన్న చిత్రాల వలన పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఇక్కడి ముఖ్యమైన విషయం ఏమిటంటే... పగిలిన, విరిగిన ఫ్రేమ్ ఫోటోలు ఇంట్లో ఉండరాదు. గుమ్మాలపై గడియారాలు ఉండకూడదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా మరిచిపోకుండా పాటిస్తే హాని కలుగదు. అపార్ట్మెంట్లలో నివశించే వారి అభిరుచులకు విరుద్ధంగా వ్యవహరిస్తూ, కుక్కలను ఇతర జంతువులను పెంచుకుంటూ ప్రతిదినం ఇతరుల ఆగ్రహానికి గురికాకుండా ఉండాలి.