సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By
Last Updated : శనివారం, 16 మార్చి 2019 (15:32 IST)

ఎలాంటి స్థలాల్లో గృహ నిర్మాణాలు చేయరాదు..?

ఇంటి నిర్మాణానికి అనుకూలమైన స్థలాలను మాత్రమే ఎంపిక చేసుకోవాలని వాస్తుశాస్త్రం చెబుతోంది. గృహ నిర్మాణానికి పనికిరాని స్థలాలను ఎంపిక చేసుకోకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు. అందుచేత గృహ నిర్మాణానికి పనికిరాని స్థలాల్ని పరిశీలిస్తే...
 
1. స్థలంలోని నాలుగు భుజాలు హెచ్చుతగ్గులుగా ఉన్నా, నాలుగు భుజాల కంటే ఎక్కవ భుజాలు కలిగి ఉన్న స్థలం అశుభాలను కలిగిస్తుంది.
 
2. చేట ఆకారంలో గల స్థలం కూడా మంచిది కాదు. ఎంత సంపాదించినా నిలువ ఉండడం అసాధ్యం. 
 
3. డమరకపు ఆకారంలో ఉండే స్థలం మంచిది కాదు. సంతానం కలగటంలో సమస్యలు, నేత్ర సంబంధిత వ్యాధులు కలుగుతాయి.
 
4. లాగుడు బండి ఆకారంలో ఉండే స్థలం ఆర్థిక పతనానికి దారి తీస్తోంది.
 
5. స్థలంలోని పొడవు ఎక్కువగా ఉండి, భుజాలు హెచ్చు తగ్గులుగా ఉండే స్థలం మంచిది కాదు. ఈ స్థలంలో ఇంటి నిర్మాణం జరిగితే పశుహాని, అనారోగ్యం కలిగిస్తుంది.