గురువారం, 28 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వాస్తు శాస్త్రం
Written By సందీప్
Last Updated : శుక్రవారం, 5 ఏప్రియల్ 2019 (12:25 IST)

ఉపయోగించని ఔషధాలు ఇంట్లో వున్నాయా? టాయ్‌లెట్‌ను తెరిచి పెడుతున్నారా?

మీ జీవితం ఇలా ఉండాలంటే.. కొన్ని వాస్తు చిట్కాలు పాటించాల్సిందే..?
ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలంటారు. దీన్ని స్పూర్తిగా తీసుకుని ప్రజలు తమ దేహాలు, తాము తినే ఆహారం, వారు పీల్చే గాలి, వారు తీసుకునే ఆరోగ్య బీమా మొదలైన వాటిపై దృష్టి కేంద్రీకరిస్తారు, అలాగే ఆరోగ్యం బాగుండాలంటే వాస్తు చిట్కాలను కూడా పాటించాలి. ఆరోగ్యవంతమైన జీవితం కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నప్పటికీ వాస్తును పాటించనట్లయితే, అది కుటుంబంలో ఆరోగ్య సమస్యల్ని కలిగిస్తుంది. 
 
ఆరోగ్యం కొరకు వాస్తు అనేది కాస్మిక్ సైన్స్‌లోని భావనలను వినియోగిస్తుంది. ఇది ఆ వ్యక్తి మరియు కుటుంబ సభ్యులపైనే కాకుండా అందరి యొక్క శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి మనం పాటించాల్సిన కొన్ని వాస్తు చిట్కాలను ఇక్కడ చూద్దాం.
 
మీరు దూలానికి దిగువన కూర్చుని పనిచేస్తారా? దూలం లేదా స్థంభం కింద కూర్చుని పని చేయవద్దు, దీని వల్ల ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. దూలం సంపూర్ణ ఇంటి యొక్క వ్యతిరేక శక్తిని భరిస్తుంది. అలా కుర్చునట్లయితే వ్యతిరేక శక్తి మీపైకి బదిలీ అవుతుంది . అందువల్ల ఆ స్థానంలో శాశ్వతంగా కూర్చోవడాన్ని మానుకోండి. మీరు ఏ దిక్కులో నిద్రిస్తారు? మీకు అనుకూలమైన దిక్కులో నిద్రించడం వల్ల మీ ఏడు చక్రాలు ఉత్తేజింపబడుతాయి. చక్రాలను క్రియాత్మకం చేయడం వల్ల అన్నిరకాల సమస్యలు పరిష్కరించబడతాయి.
 
మీ ఇంటిలోని లేదా ఆఫీసులోని బాత్‌రూమ్‌లు మరియు టాయిలెట్‌లు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయనే విషయాన్ని గుర్తుంచుకోండి. బాత్‌రూమ్‌లు మరియు టాయిలెట్‌లు చాలా వ్యతిరేక శక్తిని ఉద్గారిస్తాయి. అందువల్ల వాటిని అన్నివేళలా మూసి ఉంచడం మంచిది.

మీ ఇంటిలో ఉపయోగించని ఔషధాలున్నాయా? అయితే వాటిని వెంటనే తొలగించండి. వాస్తు ప్రకారం, ఉపయోగించని ఔషధాలను మీ ఇంటిలో ఉంచడం వల్ల అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అవి మీ గత అస్వస్థత యొక్క వ్యతిరేక మరియు మానసిక స్థితికి ప్రాతినిధ్యం వహిస్తాయి.