శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (15:09 IST)

వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి...?

వంటిల్లంటే వంటకి కావల్సిన పదార్థాలన్నీ ఉంటాయి. అయితే వాటిల్లో కొన్ని మాత్రం ఎక్కువగా రోజులు తాజాగా ఉండలేదని బాధ. వాటిని ఎలా భద్రపరచాలో తెలియక సతమతమవుతుంటారు. అలాంటివారి కోసం ఈ కింది చిట్కాలు..
 
1. పనస కాయ కోసేటప్పుడు చేతులకు నూనె రాసుకుంటే.. దానిని జిగురు అంటుకోదు. మినపప్పును నానబెట్టిన నీటిలో ఓ ఇనుప వస్తువును వేస్తే పప్పు త్వరగా నానుతుంది.
 
2. సాధారణంగా కాకరకాయ అంటేనే చేదుగా ఉంటుంది. ఈ చేదు కారణంగా కారక తినాలంటే విసుగుగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. కాకరకాయ ముక్కలకు కొద్దిగా ఉప్పు రాసి నీళ్లు చల్లుకుని ఓ గంటపాటు అలానే ఉంచితే చేదు పోతుంది.
 
3. వెల్లుల్లి రెబ్బలను మెత్తగా దంచి కొద్దిగా నీటిలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బొద్దింకలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో ఉంచితే బొద్దింకలు ఆ ప్రాంతానికి దరిచేరవు.
 
4. పచ్చిమిరపకాయలకు ముచ్చికలు తీసి ఫ్రిజ్‌లో పెట్టుకుంటే.. ఎక్కువ రోజులపాటు పాడవకుండా ఉంటాయి. గ్యాస్‌స్టవ్ దగ్గర వంట చేసేటప్పుడు ఎప్పుడూ బొద్దింకల స్ప్రే వాడకూడదు. పేలుడు సంభవించవచ్చును. కనుక జాగ్రత్త వహించండి.
 
5. ఉప్పు వేసుకునే డబ్బాలకు ఎప్పుడూ మూత పెట్టి ఉండాలి. లేకపోతే దానిలో ఉండే అయొడిన్ గాలిలో కలిసిపోయి అయోడిని లోపం వస్తుంది. చివరగా చింగువ నిల్వ చేసే డబ్బాలో ఓ పచ్చిమిరపకాయను వేసి ఉంచితే ఇంగువ తాజాగా ఉంటుంది.