గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (14:13 IST)

గుండె మంటను తగ్గించే కొబ్బరి నీరు

కొబ్బరిని మనం అనేక వంటలలో ఉపయోగిస్తాం. చాలా మంది కొబ్బరి పచ్చిగా కూడా తింటారు. కొబ్బరి నీరు లాగానే కొబ్బరి వలన కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సన్నగా ఉన్నవారు కొబ్బరి తింటే చాలా మంచిది. ఇది పొట్ట చుట్టూ పేరుకుపోయిన ప్రమాదకర ఫ్యాట్‌ను కూడా బయటకు పంపుతుంది. కొబ్బరిని తరచుగా తింటుంటే థైరాయిడ్ సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కొబ్బరి కీలక పాత్ర పోషిస్తుంది. కిడ్నీ సమస్యలు రాకుండా చూసుకుంటుంది. ఇది తింటే బరువు తగ్గకుండా బలంగా ఉంటారు. కొబ్బరిలో ఫైబర్ అధికంగా ఉండటం వలన మధుమేహ వ్యాధులను అదుపులో ఉంచగలుగుతుంది. శరీరంలోని వ్యర్ధాలను బయటకు పంపేస్తుంది. పాల కంటే కొబ్బరి నీరులో పోషక విలువలు చాలా ఎక్కువ. అసిడిటీ, గుండె మంటను కొబ్బరి నీరు తగ్గిస్తుంది. 
 
కొబ్బరి తింటే రక్తంలో ఆక్సీజన్ స్థాయిలు పెరిగి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. చర్మ సంరక్షణకు కూడా కొబ్బరి నీరు ఉపయోగపడుతుంది. జిడ్డు చర్మంతో బాధపడే వారు కొబ్బరి నీరు తాగితే, అదనపు ఆయిల్స్ బయటకు పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరిలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు తలలో చుండ్రు, పేలు చేరడం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది.