రోజూ కొబ్బరి నీరు తాగితే.. ఏమవుతుంది..?
కొబ్బరి నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నీటిని ఆయుర్వేదంలో పలురకాల అనారోగ్య సమస్యలకు ఉపయోగిస్తారు. భారతీయులు ఎంతో పురాతన కాలం నుండి కొబ్బరి నీటిని ఉపయోగిస్తున్నారు. అలానే ఇప్పటి కాలంలో కూడా వాడుతున్నారు. అయితే నిజానికి కొబ్బరి నీరు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో అనేకరకాల పోషకాలు ఉన్నాయి. వాటితో మనం పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చును.
ఇప్పటి వేసవికాలంలో కొబ్బరి నీరు రోజూ తాగడం వలన శరీరానికి చల్లదనం లభిస్తుంది. శరీరానికి వేడి చేయకుండా ఉంటుంది. కనుక వీలైనంత వరకు ప్రతిరోజూ తినే ఆహార పదార్థాలతో కొబ్బరి నీరు తీసుకుంటే ఫలితం ఉంటుంది. అజీర్తి సమస్యలతో బాధపడేవారు గ్లాస్ కొబ్బరి నీరు తాగితే సమస్య నుండి ఉపశమనం లభిస్తుంది. గ్లాస్ కొబ్బరి నీటిరు తాగుతుంటే.. ఈ వేసవిలో శరీరానికి కావలసిన ఎనర్జీ పుష్కలంగా అందుతుంది.
ఈ ఎండవేడిమిని తట్టుకోలేక చాలామంది శీతలపానీయాలు ఎక్కువగా తాగుతుంటారు. వాటికి బదులుగా ఏదైనా పండ్ల రసం లేదా కొబ్బరి నీళ్లు తాగితే శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుండి బయటపడవచ్చును. అలానే శరీరాన్ని చల్లబరిచే గుణాలు ఈ కొబ్బరి నీళ్లల్లో అధిక మోతాదులో ఉన్నాయి. కడుపులో మంట అసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో భాదపడేవారు తరచు కొబ్బరి నీరు తాగితే మంచిది.