రోజూ గ్లాస్ మజ్జిగ తాగితే..?

Last Updated: శనివారం, 20 ఏప్రియల్ 2019 (14:33 IST)
ప్రతీ సంవత్సరం లానే ఈ వేసవి కూడా మండిపోతోంది. ఈ వేడికి జనాలు రకరకాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. దీంతో మధ్యాహ్నం సమయంలో బయటకు రావాలంటేనే జంకుతున్నారు. ఏ పని ఉన్నా ఉదయమో, సాయంత్రమో బయటకు వస్తున్నారు తప్ప మధ్యాహ్నం కాలు బయట పెట్టడం లేదు. ఈ క్రమంలోనే వేసవి తాపం నుండి సేదదీరేందుకు చల్లని మార్గాలను పాటిస్తున్నారు.

ఈ వేసవి కాలంలో చల్ల చల్లగా మజ్జిగను తాగడం వలన శరీరం చల్లబడుతుంది. వేసవి తాపం నుండి ఉపశమనం లభిస్తుంది. ఎండకు వెళ్ళి వచ్చే వారు ఇంటికి చేరుకోగానే చల్లని మజ్జిగలో నిమ్మకాయ పిండుకుని తాగుతుంటే ఎండ దెబ్బ బారిన పడకుండా ఉంటారు. వేసవి తాపం తీరుతుంది. డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. మజ్జిగలోని ప్రోటీన్స్, మినరల్స్ వంటి ఖనిజాలు అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతాయి.

శరీరంలో క్యాల్షియం లోపంతో బాధపడేవారు మజ్జిగను తీసుకోవడం వలన శరీరానికి క్యాల్షియం అందుతుంది. తద్వారా ఎముకలు, దంతాలు దృఢంగా మారుతాయి. తరచు మజ్జిగను తాగడం వలన శరీరం ఉన్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మజ్జిగలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తాయి. ముఖ్యంగా గ్యాస్, అజీర్తి సమస్యలతో బాధపడేవారు రోజూ తాగితే సరిపోతుంది.

మజ్జిగతో తయారుచేసిన ఆహార పదార్థాలు తరచు తింటుంటే.. ఈ వేసవిలో శరీరానికి కావలసిన పోషకాలు పుష్కలంగా అందుతాయి. అంతేకాదు, శరీర వేడిని కూడా తగ్గిస్తుంది. అందుకుని రాత్రి సమయాల్లో మజ్జిగ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఎందుకంటే.. రాత్రివేళల్లో వేడి ఉండదు.. కాబట్టి మధ్యాహ్నం సమయాల్లో తీసుకుంటే సరిపోతుంది.దీనిపై మరింత చదవండి :