సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : ఆదివారం, 21 ఏప్రియల్ 2019 (14:29 IST)

శరీరాన్ని చల్లబరిచే నల్ల ఉప్పు

ఆయుర్వేదం మందుల తయారీలో నల్ల ఉప్పును ఉపయోగిస్తుంటారు. దీనికికారణం నల్ల ఉప్పులో అనేక ఔషధ గుణాలు ఉండటమే. ఇవి పలు అనారోగ్య సమస్యలను నివారిస్తుంది. 
 
భార‌తీయులు ఎంతో పురాతన కాలం నుంచి న‌ల్ల ఉప్పును వంట‌ల్లో ఉప‌యోగిస్తూ వ‌స్తున్నారు. కానీ ఇప్పుడు దీని వాడ‌కం త‌క్కువైంది. అయితే నిజానికి న‌ల్ల ఉప్పు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాంటి నల్ల ఉప్పు వల్ల కలిగే లాభాలేంటో పరిశీలిద్ధాం. 
 
* మలబద్దకం సమస్య ఉన్నవారు ప్రతి రోజూ నల్ల ఉప్పు కలిపిన ఓ గ్లాస్ నీరు తాగితే సమస్య నుంచి పరిష్కరిస్తుంది.
* గ్యాస్ స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డేవారు చిటికెడు న‌ల్ల ఉప్పు తింటే ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. 
* వేస‌విలో చాలా మంది శీత‌ల‌పానీయాల‌ను తాగుతుంటారు. వాటికి బదులుగా కొబ్బ‌రి నీళ్ల‌లో చిటికెడు న‌ల్ల ఉప్పు క‌లిపి తాగితే శ‌రీరం చ‌ల్ల‌బ‌డుతుంది. 
* అసిడిటీ, మంట, క‌డుపు ఉబ్బ‌రం సమస్యలతో బాధపడేవారు నల్ల ఉప్పు తింటే చక్కటి పరిష్కారం లభిస్తుంది. 
* వేసవి కాలంలో న‌ల్ల ఉప్పును వాడటం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది.