గురువారం, 9 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (14:09 IST)

అధిక రక్తపోటు(బీపీ)కు కారణమేంటి?

దాదాపు చాలా మందిలో గుండెపోటుకు కారణం హైబీపీ. హైబీపీ వస్తే కళ్లుతిరగడం జరుగుతుంటుంది. ఇది తీవ్రంగా వస్తే కాళ్లు చేతులు పడిపోయే అవకాశం కూడా ఉంది. హైబీపీ ఉన్న వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేని వారు కూడా అది రాకుండా జాగ్రత్తపడాలి. శరీరానికి అనువైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. ప్యాక్ చేసిన ఆహారాన్ని తినడం వలన రక్తంలో సోడియం పరిమాణం పెరుగుతుంది. 
 
దీనివల్ల హైబీపీ వస్తుంది. కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాలు గట్టిగా మారతాయి. ఫలితంగా హైబీపీ బారిన పడతారు. ప్రతిరోజూ పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తీసుకుంటే మంచిది. దీని వలన గుండె ఆరోగ్యంతో పాటు హైబీపీ కూడా కంట్రోల్‌లో ఉంటుంది. మద్యం సేవించడం వలన బీపీ బాగా పెరుగుతుంది. 
 
కాఫీని తక్కువగా తాగడం లేదా అసలు మానేయడం ద్వారా హైబీపీని కొంత వరకు తగ్గించుకోవచ్చు. పాలతో చేసే జున్నులో రుచి కోసం ఉప్పు అధికంగా వేస్తారు. అది తింటే శరీరంలో సోడియం పెరుగుతుంది. హైబీపీకి ఇది కూడా ఒక కారణం. చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలు తినడం కూడా అంత మంచిది కాదు.