బుధవారం, 6 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (16:15 IST)

నిద్రలేమి కారణంగా జరిగే నష్టాలివే..

నిద్ర అనేది ప్రతి ప్రాణికి ఎంతో ముఖ్యం. గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో అలసిన శరీరానికి విశ్రాంతి కూడా అంతే అవసరం. ఎన్నో పనులతో అలసిన శరీరానికి నిద్ర తిరిగి నూతనోత్సాహాన్ని ఇస్తుంది. అయితే నేడు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యల కారణంగా మనిషి నిద్రకు దూరం అవుతున్నాడు. అలసట, ఏకాగ్రత లేకపోవడం, మతిమరుపు, ఊబకాయం ఎదురవుతున్నాయి. 
 
అంతేకాదు ఎదుటి వారిపై విపరీతమైన కోపం వస్తుందట. సాధారణంగా నిద్రలేకపోతే ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణంగా అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సరిపడా నిద్రపోవాలని, అయితే అది కూడా సహజసిద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. 
 
సోషల్ మీడియాకు బానిసై, ఏవేవో కారణాల చేతనో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని వల్ల భవిష్యత్తులో ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని, అందుకు ముందు నుండే జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. 
 
కాబట్టి ఏవేవో కారణాలు చెప్పి నిద్రని అలసత్వం చేయకండి. మీకు బాగా నిద్రపట్టాలంటే పడుకునే ముందు ఓ గ్లాసు గోరువెచ్చని పాలు తీసుకోండి. అంతేకాదు అరటిపండ్లను తినడం వల్ల చక్కటి నిద్ర మీ సొంతం అవుతుంది.