శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 18 ఏప్రియల్ 2019 (14:51 IST)

భర్త నల్లగా ఉన్నాడనీ పెట్రోల్ పోసి నిప్పంటించింది..

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర రాజధాని బరేలిలో దారుణం జరిగింది. భర్త నల్లగా ఉన్నాడనీ అతను నిద్రిస్తున్న సమయంలో పెట్రోల్ పోసి తగలబెట్టిందో భార్య. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్‌లోని బరేలికి చెందిన ప్రేమ్‌ శ్రీ అనే మహిళతో సత్యవీర్‌ సింగ్‌కు రెండేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఐదు నెలల పాప కూడా ఉంది. 
 
అయితే, ప్రేమ్‌ శ్రీ తెల్లగా ఉండటంతో తన భర్త నల్లగా ఉండడంతో అతన్ని ఎగతాళి చేసేది. నల్లగా ఉన్న భర్తతో బయటకు వెళ్లడం ఇష్టం లేక ప్రేమ్‌ శ్రీ పలుసార్లు గొడవ పడ్డది. మొత్తానికి సోమవారం రాత్రి సత్యవీర్‌ నిద్రిస్తుండగా.. అతనిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించింది ప్రేమ్‌ శ్రీ. ఈ ఘటనపై సత్యవీర్‌ సోదరుడు హర్వీర్‌ సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.