గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2019
Written By
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (12:57 IST)

ఎయిర్‌పోర్టులో నేలపై పడుకుని కునుకు తీసిన ధోనీ.. సాక్షి.. నెట్టింట వైరల్

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, ఆయన సతీమణి సాక్షి.. నేలపై పడుకుని హ్యాపీగా కునుకు తీశారు. ఇంతకుముందు ధోనీ టైమ్ దొరికితే మైదానంలోని హాయిగా పడుకుని నిద్రించిన సందర్భాలున్నాయి. అయితే ఈసారి తన సతీమణితో కలిసి ఏకంగా ఎయిర్‌పోర్టులో నేలపైనే పడుకుని నిద్రించాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఐపీఎల్‌‌ బిజీ షెడ్యూల్ కారణంగా విశ్రాంతి లేకుండా ధోనీ తిరుగుతున్నాడు. ధోనీతో పాటు ఆమె సతీమణి కూడా విశ్రాంతి లేకుండా తిరుగుతోంది. తాజాగా, ధోనీ, తన భార్యతో కలిసి చెన్నై ఎయిర్ పోర్టులో నేలపైనే నిద్రించగా, ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.  బుధవారం రాత్రి, కోల్‌ కతా నైట్‌ రైడర్స్‌‌తో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆడిన సంగతి తెలిసిందే. 
 
ఆపై రెండు రోజుల వ్యవధిలోనే అంటే గురువారం నాడు జైపూర్‌లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్ జట్టుతో చెన్నై ఆడాల్సివుంది. ఈ మ్యాచ్ కోసం చెన్నై జట్టు హడావుడిగా ఎయిర్ పోర్టుకు వచ్చింది. విమానం వచ్చేందుకు టైమ్ వుండటంతో.. అప్పటికే విశ్రాంతి లేని ధోనీ నేలపైనే నిద్రించాడు. భర్తను అనుసరించిన సాక్షి కూడా అతని పక్కనే పడుకుని నిద్రపోయింది.
 
ఆ సమయంలో మిగతా ఆటగాళ్లు కుర్చీల్లో కూర్చుని సేదదీరుతున్నారు. ఇక ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్ ధోనీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ధోనీకి జట్టు ప్రయోజనాలే ముఖ్యమని, ఆయన చాలా సింపుల్‌గా ఉంటారని మరోసారి ఫ్రూఫ్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు.
 
ఇకపోతే.. చెన్నై-కోల్‌కతా జట్టుకు మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌కు అనంతరం ధోనీ మాట్లాడుతూ... చెన్నై ఫ్యాన్స్‌ను ప్రశంసలతో ముంచెత్తాడు. కోల్‌కతా జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు గెలుపును నమోదు చేసుకుంది. దీంతో ట్విట్టర్‌లో చెన్నై ఫ్యాన్స్ ట్వీట్ల వర్షంతో కుమ్మేస్తున్నారు. 
 
చెన్నైలో బుధవారం రాత్రి జరిగిన 23వ లీగ్ మ్యాచ్‌‌లో చెన్నై సూపక్ కింగ్స్-కోల్‌కతా జట్లు తలపడ్డాయి. తొలుత టాస్ గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా జట్టు బ్యాట్స్‌మెన్లకు చెన్నై బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో వంద పరుగులు సాధిస్తుందా అనే అనుమానం ఏర్పడింది. 
 
కానీ కోల్‌కతా జట్టులో రసెల్ మాత్రం అర్థ సెంచరీని సాధించి జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరును సంపాదించిపెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. ఫలితంగా 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి కోల్‌కతా 108 పరుగులు సాధించింది. తదనంతరం బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 17.2 ఓవర్లలో మూడు వికెట్ల పతనానికి 111 పరుగులు సాధించింది. దీంతో కోల్‌కతాపై చెన్నై ఏడు వికెట్ల తేడాతో గెలుపును నమోదు చేసుకుంది.  
 
చెన్నై గెలవడంతో ధోనీ ఫ్యాన్స్ ట్విట్టర్‌ను షేక్ చేస్తున్నారు. కోల్‌కతాపై సెటైర్లలో భాగంగా ''నైస్ మీటింగ్ యూ'' అనే ట్వీట్ వైరల్ అవుతోంది. అలాగే చెన్నై స్టార్ ప్లేయర్ భజ్జీ చేసిన ట్వీట్ సోషల్ మీడియాను కుదిపేస్తోంది.