ఇంటిని క్లీన్ చేసేటప్పుడు వీటిని పాటిస్తే దోమలు, క్రిములు ఇంట్లోకి రావు..

మోహన్| Last Updated: మంగళవారం, 23 ఏప్రియల్ 2019 (13:15 IST)
సాధారణంగా ఇంటిని చూస్తే ఇల్లాలిని చూడక్కర్లేదంటుంటారు. మనం ఉపయోగించే ఏ వస్తువునైనా తీసిన చోటే పెట్టేస్తే ఇల్లు నీట్‌గా ఉంటుంది. చాలా వస్తువులను పనికొస్తాయని మనం దాచిపెడుతుంటాం. కొన్ని రోజుల తర్వాత వాటి విషయాన్ని పూర్తిగా మరచిపోతుంటాము. ఆ వస్తువులు బాగున్నప్పుడే ఎవరికైనా ఇస్తే ఉపయోగపడతాయని ఆలోచించండి.

మీరు ఏ వస్తువునైనా ఖచ్చితంగా ఉపయోగిస్తాము అనుకుంటే మాత్రమే వాటిని అందుబాటులో ఉంచుకోండి. అలాగే ఇంటిని క్రమం తప్పకుండా క్లీన్ చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి. పురుగులు, బొద్దింకలు, బల్లులు, క్రిములు వంటివి చేరవు. అందుకోసం ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించి చూడండి.

* గోరువెచ్చని నీటిలో కొద్దిగా సోడా వేసి ఇల్లు తుడిస్తే, జిడ్డు, మరకలు వంటివి పోయి ఫ్లోర్ తళతళ మెరుస్తుంది. ఆ నీటిలో కొద్దిగా ఉప్పు కలిపితే దోమలు, ఈగలు వంటి సూక్ష్మక్రిములు రాకుండా ఉంటాయి.

* ఇంటిలో మొండి మరకలు ఉన్నట్లయితే నిమ్మరసం, అలాగే నిమ్మతొక్కలతో రుద్దితే సరి.

* ఇంట్లో ఏదైనా మూలభాగంలో కర్పూరం వెలిగించినట్లయితే, ఇల్లంతా మంచి వాసన వస్తుంది. క్రిములు సైతం నాశనం అవుతాయి.

* వంట చేసే ప్రదేశంలో నూనె చుక్కలు పడి జిడ్డుగా ఉంటే, ఆ జిడ్డు పోవడానికి నిమ్మ చెక్కపై కాస్తంత ఉప్పు, సర్ఫ్ వేసి రుద్దితే జిడ్డు పోయి నీట్‌గా కనిపిస్తుంది.

* ఇంట్లో చెడు వాసన వస్తుంటే ఇల్లు తుడిచే నీటిలో కాస్తంత లావెండర్ ఆయిల్ లేదా నిమ్మ తొక్కల్ని మరిగించి, ఆ నీటితో తుడిస్తే మంచి వాసన వస్తుంది.దీనిపై మరింత చదవండి :