గురువారం, 23 జనవరి 2025
  1. ఇతరాలు
  2. మహిళ
  3. ఉమెన్ స్పెషల్
Written By
Last Updated : శుక్రవారం, 19 ఏప్రియల్ 2019 (15:37 IST)

కొబ్బరి నూనె, పసుపుతో లిప్‌స్క్రబ్ వేసుకుంటే..?

కొంతమంది చూడటానికి చాలా అందంగా ఉంటారు. కానీ వారి పెదాలు మాత్రం నల్లగా ఉంటాయి. అందుకు కారణం పెదాలపై మృతకణాలు పేరుకుపోవడమే. ఎప్పటికప్పుడు వాటిని తొలగించుకోకపోతే ఇబ్బందుల్లో పడవలసి వస్తుందని చెప్తున్నారు. చెప్పాలంటే కొందరి పెదాలు పొడిబారి పోతుంటాయి. పెదాల్లో నాజూకుతనం, ఎరుపుదనం కనిపించవు. 
 
ఇలా కాకుండా, పెదాలపై ఉండే నలుపు, పిగ్మెంటేషన్ పోవడానికి సహజమైన లిప్‌స్క్రబ్స్ కొన్ని వున్నాయి. వీటిని వంటింట్లో దొరికే పదార్థాలతో తయారుచేసుకోవచ్చు. మరి అదేలాగో చూద్దాం..
 
చక్కెర, పసుపు, కొబ్బరినూనె మిశ్రమంతో చేసే లిప్‌స్క్రబ్‌ను పెదాలపై రాసుకుంటే మృదువుగా అవుతాయి. పెదాలపే ఉన్న మృతకణాలను చక్కెర పూర్తిగా పోగొడుతుంది. కొబ్బరినూనె పెదాలకు మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. పసుపులోని సహజ ఔషధగుణాల వలన పెదాలపై టాన్ పోతుంది. దీంతో పొడిబారిన పెదాలు మృదువుగా, గులాబీ రంగులోకి వస్తాయి. ఈ లిప్‌స్క్రబ్ తయారీకి వాడే పదార్థాలన్నీ వంటింట్లో దొరికేవే. 
 
ఓ గిన్నెలో స్పూన్ చక్కెర, చిటికెడు పసుపు, కొద్దిగా కొబ్బరి నూనె వేసి మెత్తటి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెదాలపై రాసుకుని 3 నిమిషాలు సున్నితంగా రుద్దాలి. 10 నిమిషాల తరువాత చల్లని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వలన పెదాలు పింక్ రంగులోకి వస్తాయి. ఇలా తయారుచేసుకున్న లిప్‌స్క్రబ్‌ను బాటిల్‌లో పోసి ఫ్రిజ్‌లో నిల్వచేసుకోవచ్చును. 
 
స్పూన్ బీట్‌రూట్ రసంలో అరస్పూన్ చక్కెర కొద్దిగా తేనె వేసి కలుపుకోవాలి. 2 నిమిషాలు ఈ స్క్రబ్‌ను పెదాలకు పట్టేలా రుద్ది ఆ తరువాత 15 నిమిషాలకు కాటన్ బాల్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి. దీంతో పెదాలు 15 నిమిషాల్లోపే ఎర్రగా మారుతాయి. అంతేకాదు, ఈ మిశ్రమం పెదాలకు మాయిశ్చరైజర్‌ను అందజేసి పెదాలను మృదువుగా, ఆకర్షణీయంగా ఉంచుతాయి.