శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (11:39 IST)

మీరు అతిగా నిద్రిస్తున్నారా? ఈ అనర్థాలు తప్పవు మరి...

మన జీవనవిధానంలో నిద్ర ఎంత ఆవశ్యకమో అందరికీ తెలిసిందే. నిద్ర వల్లే మన శరీరం పునరుత్తేజం చెందుతుంది. శరీరంలో ఉండే కణజాలం మరమ్మత్తులకు గురవుతాయి. కణాలకు నూతన శక్తి వస్తుంది. సరిగ్గా నిద్రపోతే మరుసటి రోజంతా ఉత్సాహవంతంగా ఉండవచ్చు. రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు కనీసం 6 నుండి 8 గంటలపాటు నిద్రించాలి. 
 
అందులో కొంతమంది రోజుకు 8 గంటలకంటే ఎక్కువ సమయం పాటు నిద్రిస్తుంటారు. వాస్తవానికి ఇలా చేయడం మంచిది కాదు. అతిగా నిద్రించడం వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
 
రోజుకు 8 గంటల కన్నా ఎక్కువ సమయంపాటు నిద్రించే వారిలో డయాబెటిస్, హైబీపీ, గుండె జబ్బులు వస్తాయని సైంటిస్టులు చేపట్టిన తాజా అధ్యయనాల్లో వైల్లడైంది. అతిగా నిద్రించడం వల్ల బద్ధకం బాగా పెరిగిపోతుంది. 
 
ఎప్పుడూ మబ్బుగా ఉన్నట్లు కనిపిస్తారు. నీరసంగా ఉంటూ, శక్తి లేనట్లు కనిపిస్తారు. అతి నిద్ర వల్ల అధికంగా బరువు పెరుగుతారని సైంటిస్ట్‌లు చెబుతున్నారు. కనుక అతిగా నిద్రించరాదు. ఒక ప్రణాళిక రూపొందించుకుని నిత్యం 6 నుంచి 8 గంటల పాటు మాత్ర‌మే నిద్రించాలి. దాంతో అనేక ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు చేకూరుతాయి..!