రాత్రి వేళల్లో లో-దుస్తులు లేకుండా నిద్రిస్తే...?
బిగుతైన అండర్‌వేర్‌ను ధరించడం వల్ల మనకు కలిగే అనారోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయంటున్నారు వైద్య నిపుణులు. రాత్రి పూట లోదుస్తులు లేకుండా నిద్రించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు. అలా నిద్రించడం చాలా మంచిదట.
లోదుస్తులు లేకుండా నిద్రించడం వల్ల శరీరం మొత్తానికి సరిగ్గా గాలి తగుతుంది. దీనివల్ల బాడీ సాధారణ ఉష్ణోగ్రతకు చేరుకుంటుంది. దీంతో శరీరంలోని జీవక్రియలు సక్రమంగా జరుగుతాయి. శరీరంలో ఉన్న హార్మోన్లన్నీ సక్రమంగా పనిచేస్తాయట. వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా దరిచేరవట. దీంతో యవ్వనంగానే కనిపిస్తారట. అంతేకాదు అలా నిద్రించడం వల్ల శరీరానికి రిలాక్సేషన్ కలుగుతుందట.
జననావయవాలకు చాలా మంచిదట. మహిళలకు ఫంగస్ ఇన్ఫెక్షన్లు అసలు రావట. పురుషుల్లో శృంగార సామర్థ్యం, వీర్య కణాలు ఆరోగ్యంగా ఉంటాయట. దీనివల్ల సంతానం సాఫల్యత విషయాల్లో మంచి ప్రయోజనం వుంటుంది. అండర్‌వేర్ లేకుండా నిద్రించడం వల్ల శృంగారం స్వేచ్ఛగా ఉండి మనస్సుకు కూడా మరింత ప్రశాంతత చేకూరుతుందట. అలా నిద్రించడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు కూడా తొలగిపోతాయట.