ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : ఆదివారం, 24 మార్చి 2019 (16:33 IST)

ఎరుపు రంగు ద్రాక్షతో ఎన్ని ప్రయోజనాలో...

ద్రాక్ష పండ్ల సీజన్ మొదలైంది. ప్రస్తుతం మార్కెట్‌లో తెల్ల ద్రాక్ష పండ్లు విరివిగా లభిస్తున్నాయి. ఈ ద్రాక్ష పండ్లు తెల్ల, నలుపు, ఎరుపు రంగుల్లో ఉంటాయి. వీటిలో ప్ర‌ధానంగా ఎరుపు రంగు ద్రాక్ష పండ్ల‌ను తింటే ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
 
* ఎరుపు రంగులో ఉండే ప్రతి రోజూ ఆరగించడం వల్ల శ‌రీరంలో ఉండే వాపులు పోతాయి. 
* అధిక బ‌రువు త‌గ్గుతారు. కీళ్ల నొప్పులు, గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. 
* వ‌య‌స్సు మీద ప‌డ‌డం కార‌ణంగా వ‌చ్చే అల్జీమ‌ర్స్ వ్యాధి రాకుండా అడ్డుకోవ‌చ్చు. 
* ఇత‌ర రంగు ద్రాక్ష‌ల క‌న్నా ఎరుపు రంగు ద్రాక్ష‌ల్లోనే యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. 
* ఇవి ఫ్రీ ర్యాడిక‌ల్స్ వ‌ల్ల‌ శ‌రీర క‌ణ‌జాలం నాశ‌నం కాకుండా ర‌క్షిస్తాయి. 
* ఎరుపు రంగు ద్రాక్ష‌ల‌ను నిత్యం తింటే రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు త‌గ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. 
* చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గిపోవడంతో గుండె జ‌బ్బులు రాకుండా ఉంటాయి. 
* నిత్యం ఎరుపు రంగు ద్రాక్ష‌ల‌ను తింటుంటే ర‌క్త స‌ర‌ఫ‌రాతో పాటు కంటి చూపు పెరుగుతుంది. 
* డ‌యాబెటిస్ ఉన్న‌వారు ఎరుపు రంగు ద్రాక్ష‌లను తిన‌డం మంచిది. దీంతో వారి ర‌క్తంలో షుగ‌ర్ స్థాయిలు త‌గ్గుతాయి.