శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సిహెచ్
Last Modified: మంగళవారం, 26 మార్చి 2019 (19:17 IST)

ప్రతిరోజు పురుషులు రెండుసార్లు ఒక స్పూన్ అశ్వగంధ లేహ్యం తీసుకుంటే..?

మనకు ప్రకృతిపరంగా లభించే అశ్వగంధలో అనేక రకములైన ఆరోగ్య ప్రయయోజనాలు దాగి ఉన్నాయి. హార్మోన్ల ఉత్పత్తికి తోడ్పడే, శక్తి స్థాయిని పెంచే పొటాషియం, క్యాల్షియం ఇందులో సమృద్దిగా ఉన్నాయి. పునరుత్పత్తి అవయవాలకు రక్తప్రసారాన్ని మెండుగా అందించే విటమిన్ ఇ కూడా అశ్వగంధలో హెచ్చుగానే ఉంది. అశ్వగంధ క్యాన్సర్ జబ్బులు రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా నరాల నీరసాన్ని తగ్గిస్తుంది. అశ్వగంధలో ఉన్న మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేమిటో చూద్దాం.
 
1. అశ్వగంధి మత్తు కలిగించే ఔషధంగాను, మంచి పుష్టినీ బలాన్ని చేకూర్చేదిగాను, ఉదర సంబంధ వ్యాధులకు దివ్యౌషధంగాను, జ్ఞాపక శక్తిని అత్యంత వేగంగా పెంచే ఔషధంగాను, ఎంతగానో ఉపయోగపడుతుంది. 
 
2. అంతేకాకుండా, క్యాన్సర్‌కి దీనిని మించిన ఔషధం మరొకటి లేదంటే, ఆశ్చర్యపడనక్కర్లేదు. ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కుంటున్న ఒత్తిడిని నివారించడంలో దీనికిదే సాటి. నీరసాన్ని, నిస్త్రాణని దగ్గరకి రానివ్వదు. కండరాల వ్యాధులకి ఎంతగానో ఉపయోగపడుతుంది.
 
3. విషాన్ని హరించే శక్తి దీనికి అమితంగా ఉంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఆర్థ్రైటిక్, యాంటీ బాక్టీరియల్‌, యాంటీ డిప్రెసంట్‌గా అశ్వగంధి అవెూఘంగా పనిచేస్తుంది.
 
4. అశ్వగంధ చూర్ణంలో యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. కాబట్టి.. ఇది ఎఫెక్టివ్ పెయిన్ కిల్లర్‌లా పనిచేస్తుంది. కాబట్టి కీళ్ల నొప్పులు వంటి రకరకాల నొప్పులు తగ్గిస్తుంది. అశ్వగంధ చూర్ణం తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులతో బాధపడేవాళ్లకు ఉపశమనం కలుగుతుంది.
 
5. డిప్రెషన్‌తో బాధపడే వాళ్లకు అశ్వగంధ అద్భుత ఔషధంగా చెప్పవచ్చు. ఇందులో ఉండే యాంటీ డిప్రజంట్.. డిప్రెషన్‌ని తగ్గించి.. ప్రశాంతతను కలిగిస్తుంది.
 
6. ఇటీవలి కాలంలో చాలామంది లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారు.. ఈ సమస్యలకు వెంటనే ట్రీట్మెంట్ అందివ్వడం చాలా అవసరం. అశ్వగంధలోని అద్భుత ప్రయోజనాల్లో ఇది ముఖ్యమైనది. అశ్వగంధ చూర్ణం ద్వారా శృంగార సమస్యల నుంచి వేగంగా ఉపశమనం పొందినట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
 
7. ప్రతిరోజు రెండుసార్లు ఒక స్పూన్ అశ్వగంధ లేహ్యం లేదా అర స్పూన్ పొడి లేదా రెండు క్యాప్సూల్స్ తీసుకోవాలి. దీనివల్ల వీర్యకణాల నాణ్యత, పరిమాణం, శృంగార సామర్థ్యంలో చెప్పుకోదగిన తేడాను గమనించవచ్చు.
 
8. అశ్వగంధ తీసుకుంటే శక్తి మరియు మొత్తం శరీరం బలం పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. ఇది నరాల బలానికి, పునరుత్పత్తి అవయవాలు యవ్వనానికి మరియు శరీరానికి కొత్త శక్తిని ఇస్తుంది. తద్వారా శరీరం బలహీనత మరియు అలసట నిర్మూలించి కొత్త శక్తిని తెస్తుంది. అంతేకాక మనస్సుకు విశ్రాంతి కలిగించి మంచి నిద్రను అందిస్తుంది.