మంగళవారం, 5 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శనివారం, 23 మార్చి 2019 (16:09 IST)

వ్యాధులు ప్రాధమిక లక్షణాలు...?

వ్యాధులు మూడు ప్రాధమిక లక్షణాలు కలిగివున్నాయి. అవి వాతం, పిత్త, కఫం.. అసమతుల్యత ఆధారంగా ఏర్పడుతాయని ఆయుర్వేదం చెబుతోంది. అన్ని రకాల వ్యాధులను ఆయుర్వేదం ప్రకారం మూడు రకాలుగా వర్గీకరించాయి. 
 
అధి భౌతికం - ప్రకృతి సిద్ధంగా ఏర్పడే వ్యాధులు. 
అధి దైహికం - శారీరక, మానసిక సమస్యల కారణంగా ఏర్పడే వ్యాధులు. 
అధి దైవికం - దైవ సంబంధిత లేదా దుష్టశక్తుల కారణంగా ఏర్పడే వ్యాధులు. 
మరింత సులభంగా చికిత్స చేసేందుకు వీలుగా ఈ క్రింది విధాలుగా విభజించారు. 
 
ఆది బాల ప్రవృతి - జన్యు సంబంధంగా వచ్చే అనారోగ్య సమస్యలు. 
జన్మ బాల - పుట్టుకతో ఏర్పడిన వ్యాధులు. 
దోష బాల - వాత, పిత్త, కఫ సమతుల్యత దెబ్బతినడం వల్ల తలెత్తే వ్యాధులు.
సంఘట బాల - మానసిక, శారీరక సమస్యల కారణంగా ఏర్పడే వ్యాధులు. 
 
కాల బాల - ఓ ప్రత్యేక సమయం/ఋతువులో ఏర్పడే వ్యాధులు.
దైవ బాల - దేవతా శక్తులు, దుష్ట శక్తుల కారణంగా ఏర్పడే సమస్యలు. 
స్వభావ బాల - సహజ సిద్ధంగా ఏర్పడే మార్పులు (వయసుకి తగినట్లు ఏర్పడే సమస్యలు).