ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సందీప్
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (17:40 IST)

పురుషుల్లో ఆ సమస్యలుంటే.. ముల్లంగిని తీసుకోండి..

రోజూ మనం అనేక రకాల కూరగాయలను వంటల్లో వాడుతుంటాము. కూరగాయలను బట్టి మన శరీరానికి వివిధ రకాల పోషకాలు అందుతాయి. మనం ఆహారంగా తీసుకునే దుంపకూరల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అవి మనకు పోషణను ఇవ్వడమే కాక ఆనారోగ్యం రాకుండా కూడా చూసుకుంటాయి. 
 
దుంపకూరల్లో ముల్లంగిది ప్రత్యేకమైన స్థానం. శృంగార సమస్యలతో బాధపడేవారు ముల్లంగిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే ప్రయోజనం ఉంటుంది. దీనిని సాంబారులో విరివిగా ఉపయోగిస్తారు. పచ్చడి కూడా చేసుకుంటారు. ముల్లంగిలో ఉన్న ఔషధ గుణాలేమిటో ఇప్పుడు చూద్దాం.
 
రెండు, మూడు స్పూన్ల ముల్లంగి ఆకుల రసాన్ని ఉదయం పూట తాగుతుంటే కడుపులోని క్రిములు నశిస్తాయి. చెవిపోటు ఉన్నవారు నువ్వుల నూనెలో మూడింతల ముల్లంగి ఆకుల రసం కలిపి నీరు పూర్తిగా ఆవిరయ్యే వరకు మరిగించి, చల్లార్చి వడకట్టి ఒక సీసాలో ఉంచుకుని అవసరమైనప్పుడు కొద్దిగా వేడి చేసి రెండు మూడు చుక్కలు చెవిలో వేస్తే సరిపోతుంది.
 
నాలుగు చెంచాల ముల్లంగి రసంలో అరస్పూన్ ఉలవల పొడి, అరస్పూన్ మెంతిపొడిని వేసి చూర్ణంలా చేసుకుని రోజు రెండుసార్లు సేవించడం వల్ల మూత్రపిండ, మూత్రాశయలలో రాళ్ళు కరిగిపోతాయి. ముల్లంగి ముక్కని మెత్తటి ఉప్పులో అద్ది తేలు కుట్టిన చోట ఉంచితే మంట, నొప్పి, పోటు త్వరగా తగ్గుతాయి. ఇటీవల కాలంలో మగవారిలో శృంగార సమస్యలు ఎక్కువగా వేధిస్తున్నాయి. 
 
అలాంటివారు ఒక స్పూను ముల్లంగి గింజల్ని ఆవుపాలల్లో వేసి బాగా కాచి చల్లార్చి వడకట్టి ఆ పాలను రాత్రి పడుకునే ముందు తాగుతుంటే సమస్య తగ్గుతుంది. ముల్లంగి గింజల్ని, నీటితో మెత్తగా నూరిన గంధాన్ని గజ్జి, చిడుము, దురద ఉన్న ఆయా ప్రాంతాల్లో అప్లై చేసినట్లయితే చర్మవ్యాధులు దూరమవుతాయి. నిత్యం 10-20 మి.లీ ముల్లంగి ఆకుల రసంలో కాస్తంత పంచదార కలిపి రెండుసార్లు సేవిస్తుంటే కామెర్ల వ్యాధి త్వరగా తగ్గిపోతుంది.