సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. స్వీట్లు
Written By
Last Updated : బుధవారం, 20 మార్చి 2019 (15:01 IST)

మీల్ మేకర్ హల్వా ఎలా చేయాలో తెలుసా..?

కావలసిన పదార్థాలు:
మీల్‌మేకర్ - 1 కప్పు
చక్కెర - అరకప్పు
పాలు - 1 కప్పు
పచ్చికోవా - పావుకప్పు
నెయ్యి - 2 స్పూన్స్
కిస్‌మిస్ - 1 స్పూన్
వేడినీరు - 2 కప్పులు
యాలకుల పొడి - అరస్పూన్
 
తయారీ విధానం:
ముందుగా మీల్‌మేకర్‌ని వేడినీళ్లల్లో 5 నిమిషాలు ఉంచి తీయాలి. ఆపై అవి చల్లారిన తరువాత పిండేసి.. మెత్తగా మెదుపుకోవాలి. తరువాత స్టౌవ్ మీద బాణలి పెట్టి చెంచా నెయ్యి కరిగించి అందులో జీడిపప్పు, కిస్‌మిస్ వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో మిగిలిన నెయ్యి కరిగించి మెత్తగా చేసుకున్న మీల్‌మేకర్‌ను వేసుకోవాలి.

ఆపై పచ్చిదనం పోయాక అందులో పాలు పోసి మూతపెట్టి మంట తగ్గించాలి. కాసేపటి తరువాత మిశ్రమం ముద్దలా దగ్గరకు వస్తుంది. అప్పుడు చక్కెర, పచ్చికోవా వేసి కలుపుకోవాలి. చివరగా జీడిపప్పు, కిస్‌మిస్ పలుకులు, యాలకులపొడి కలిపి దింపేయాలి. అంతే... మీల్‌మేకర్ హల్వా రెడీ.