శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : శనివారం, 23 మార్చి 2019 (16:22 IST)

ఎండాకాలంలో కుండలో నీరు తాగండి.. డీహైడ్రేషన్..?

ఎండాకాలంలో కారం, మసాలా, నూనె పదార్థాలను తగ్గించాలి. లేదంటే శరీరంలోని నీరు ఆవిరైపోయి డీహైడ్రేషన్‌ మొదలై, వడదెబ్బకు దారితీస్తుంది. తియ్యగా, చల్లగా ఉండే ఆహారాలనే తీసుకోవాలి. పలుచని చారు, కారం లేని పులుసు, మజ్జిగ చారు, పెరుగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. దాహం లేకపోయినా, కుండలోని నీళ్లు తాగుతూ ఉండాలి.
 
ఫ్రిజ్‌ నీటి వల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగే ప్రమాదం ఉంది. ఉప్పు కలిపిన మజ్జిగ, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం వంటివి ఆరారగా తాగాలి. పుచ్చకాయ, కర్బూజా, ముంజెల్లో ఖనిజ లవణాలు అధికం. వేసవిలో వీటిని తీసుకుంటే డీహైడ్రేషన్‌ నుంచి తప్పించుకున్నట్లే. ముఖ్యంగా మట్టి కుండల్లో నీటిని వుంచి.. ఆ నీటిని సేవించాలి. మట్టికుండలు రుతువును, ఉష్ణోగ్రతను బట్టి నీటిని చల్లగా వుంచుతుంది. 
 
మట్టిలోని ఆల్కలైన్ అనేది.. నీటిలో ఆమ్లాలు చేరకుండా భద్రపరుస్తుంది. తద్వారా అసిడిటీ సమస్య ఉత్పన్నం కాదు. అందుకే మట్టి కుండల్లో వండే ఆహారం తీసుకుంటే గ్యాస్ట్రిక్, అసిడిటీ సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
మట్టికుండల్లోని నీటిని తాగడం ద్వారా శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇంకా గొంతుకు సంబంధించిన రోగాలను దూరం చేసుకోవచ్చునని వైద్యులు చెప్తున్నారు. అయితే మట్టి పాత్రలను ఉపయోగించేటప్పుడు రోజూ వాటిని శుభ్రం చేస్తూ వుండాలని వారు సూచిస్తున్నారు.