మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By మోహన్
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (10:38 IST)

వేడి నీటితో స్నానం చేస్తే బరువు తగ్గిపోతారట..

అధిక బరువును తగ్గించుకోవడానికి అన్ని మార్గాలను ప్రయత్నించి విసిగిపోయారా? వ్యాయామాలు, ఆహార నియమాలతో పాటు అన్నింటినీ ట్రై చేసారా? వీటి వల్ల కూడా ఫలితం కనిపించడం లేదా? అయితే వీటన్నింటితో పాటుగా వేడి నీళ్లతో స్నానం చేస్తే బరుగు తగ్గడంలో సహాయం చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. 
 
అంతే కాదు వేడి నీళ్ల స్నానం దాదాపు 30 నిమిషాల పాటు వాకింగ్ చేయడానికి సమానమట. అదేంటి? స్నానానికి అధిక బరువుకి సంబంధం ఏమిటి అనుకుంటున్నారా? అసలు ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ కథనాన్ని ఓసారి చదవాల్సిందే..  
 
సాధారణంగా బరువు తగ్గించుకోవడానికి ముందుగా గుర్తొచ్చేది వ్యాయామం, అందులోనూ జిమ్‌కి వెళ్లడం. శరీరాన్ని ఫిట్‌గా ఉంచడం జిమ్ వల్లే సాధ్యమవుతుందని చాలా మంది అనుకుంటారు. కానీ శరీరాన్ని మరింత ఆరోగ్యవంతంగా, ఫిట్‌గా ఉంచుకోవడానికి జిమ్, వాకింగ్‌తో పాటు వేడి నీళ్ల స్నానం కూడా సహాయపడుతుందని లండన్ యూనివర్సిటీ పరిశోధకుడు డాక్టర్ ఫాల్కినర్ అంటున్నారు.
 
ఈ పరిశోధనలో మొత్తం 14 మంది పురుషులు పాల్గొన్నారు. వీళ్లందరూ మొదట గంటసేపు సైకిల్ తొక్కడం, వాకింగ్ లాంటి వ్యాయామాలు చేసారు. తర్వాత గంట వేడి నీటి టబ్‌లో ఉన్నారు. ఈ రెండు పరీక్షల్లో ఖర్చయిన కేలరీలను లెక్కిస్తే సమానంగా తగ్గాయి. అంతేకాకుండా రోజూ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల శరీరంలో 130 క్యాలరీలు తగ్గించుకోవచ్చు.
 
సాధారణంగా వేడి నీళ్లు శరీర బరువును తగ్గించే ప్రక్రియను మరింత వేగవంతం చేసి శరీరంలోని వేడిని తగ్గిస్తాయి. శరీర బరువుని తగ్గించే వ్యాయామాలలో కూడా ఇదే ప్రక్రియ జరుగుతుంది. అందువల్ల శరీర బరువు తగ్గుతుంది. అంతే కాదు వేడి నీటిలో ఉన్న వాళ్లలో 10 శాతం షుగర్ లెవల్స్ కూడా తగ్గాయి. 
 
మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల స్థూలకాయ సమస్య అధికమవుతోంది. కానీ సమయం లేక చాలా మంది వ్యాయామాలకు తగిన సమయం కేటాయించలేకపోతున్నారు. అలాంటి వారికి ఈ వేడి నీళ్ల స్నానం బాగా ఉపయోగపడుతుంది.